చాలా రోజుల త‌ర్వాత టాలీవుడ్‌లో ఆడియో ఫంక్ష‌న్..AIతో పాట పాడించిన ఆస్కార్ విన్నర్

చాలా రోజుల త‌ర్వాత టాలీవుడ్‌లో ఆడియో ఫంక్ష‌న్..AIతో పాట పాడించిన ఆస్కార్ విన్నర్

సినిమా ఇండ‌స్ట్రీలో కొత్త కొత్త పోక‌డ‌లు వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు ఆడియో ఫంక్ష‌న్స్ పేరిట సినిమా ప్రచారాలు చేసేవారు. కాని ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని చేస్తున్నారు. అయితే ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’ ఆడియో వేడుక‌ని గ‌త రాత్రి ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈమధ్య కాలంలో ఓ సినిమాకు ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేయడం ఇదే తొలిసారి.మూవీకి కీర‌వాణి సంగీతం అందించ‌గా, ఆయన అద్భుత‌మైన బాణీల‌ని స‌మ‌కూర్చిన‌ట్టు తెలుస్తుంది. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించాడు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 25న రిలీజ్ చేయ‌నుండ‌గా, ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జోరుగా సాగుతున్నాయి.

రిలీజ్ కి ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి టీజర్ అండ్ సాంగ్ రిలీజ్ లతో సందడి చేస్తుంది మూవీ బృందం. ఇక మూవీ ఆడియో లాంచ్ సంప్ర‌దాయం ఎప్పుడో క‌నుమ‌రుగు కాగా, దానిని మ‌ళ్లీ తీసుకు వ‌చ్చారు. కీరవాణి సంగీత దర్శకత్వంలో సినిమాకి మొత్తం ఏడు పాటల్ని సమకూర్చారట. ఇక ఏ పాటల్లో ఒక పాటని AI టెక్నాలజీ ఉపయోగించి పాడించారట. ఇప్ప‌టివ‌ర‌కు పాడిన పాట‌ల‌నే మ‌ళ్లీ ఏఐతో పాడించారు.కాని మొద‌టి సారి కొత్త సాంగ్‌ని ఏఐతో పాడించ‌డం కీర‌వాణికి చెల్లింద‌ని దిల్ రాజు అన్నారు. ఏదో వండ‌ర్ క్రియేట్ చేయాల‌ని, కొత్త‌వారితో క‌లిసి కీరవాణి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. చ‌రిత్ర‌లో నిలిచిపోయే విధంగా ఏఐ ద్వారా ఓ పాట పాడించారు. ఎక్స్ పెరిమెంట‌ల్‌గా చేశారు.

కీర‌వాణిగారు ఈ సినిమా పాట‌ల్లో చేసిన‌ ప్ర‌యోగాల‌న్నీ నాకు తెలుసు. ముందు నాలుగు పాట‌ల‌నే అనుకున్నాం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి కీర‌వాణి ద‌గ్గ‌రికి సినిమా వెళ్లాక‌, మొత్తం 7 పాట‌లు చేశారు. ఆట‌గ‌ద‌రా శివ సాంగ్ ని ముందు అనుకోలేదు.కానీ, పాట విన్నాక చాలా మంచి వైబ్‌ అనిపించింది. ఆ పాట సినిమాను ఇంకో లెవ‌ల్‌కి తీసుకెళ్తుంది. కొత్త‌గా కొత్త కొత్త‌గా అనే పాట కూడా చాలా బావుంది. క్లైమాక్స్ లో వస్తుంది ఈ పాట‌. టోట‌ల్ సినిమాను రౌండ‌ప్ చేయ‌డానికి ఈ పాట‌ను పెట్టామ‌ని అన్నారు దిల్ రాజు . ఇక ఆడియో ఈవెంట్స్ క‌ల్చ‌ర్‌ని మ‌ళ్లీ తీసుకొస్తున్నామని ప్రకటించారు దిల్ రాజు. ఇకపై వీలైనప్పుడల్లా తమ సినిమాలకు ఇలా ఆడియో రిలీజ్ ఫంక్షన్లు చేస్తామని తెలియ‌జేశారు.