Kishan Reddy Challenge| సీఎం రేవంత్, కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సవాల్
తెలంగాణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం అని సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణకు కేంద్రం చేసిన అభివృద్ధి పనులను.. ప్రజల ముందు ఉంచుతాం అని..ప్రెస్ క్లబ్ వేదికగా బహిరంగ చర్చకు మేం సిద్ధం అని..వారు కూడా చర్చకు ముందుకు రావాలని సవాల్ చేశారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధి(Telangana development )పై బహిరంగ చర్చ(Open Debate)కు సిద్ధం అని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), మాజీ సీఎం కేసీఆర్(KCR)కు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి(Kishan Reddy challenge)సవాల్ విసిరారు. తెలంగాణకు కేంద్రం చేసిన అభివృద్ధి పనులను..ప్రజల ముందు ఉంచుతాం అని..ప్రెస్ క్లబ్ వేదికగా బహిరంగ చర్చకు మేం సిద్ధం అని..వారు కూడా చర్చకు ముందుకు రావాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణను నిర్లక్ష్యం చేశామంటూ కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి అనేక అభివృద్ధి ప్రాజెక్టులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణకు పదేళ్లుగా కేంద్రం ఇచ్చిన నిధులు, అభివృద్ధిపైన ప్రెస్‌క్లబ్ వేదికగా చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
సొంత పార్టీ నేతల నుంచి, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తన సీఎం కుర్చీ కాపాడుకునేందుకు కేంద్రంపైన, నాపైన సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ, ఖర్గేలు కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను కాపాడుతున్నారని, వారి సూచన మేరకే కాళేశ్వరం సహా ఏ స్కామ్ లోనూ బీఆర్ఎస్ నేతలను రేవంత్ రెడ్డి అరెస్టు చేయలేదన్నారు. కేవలం కాంగ్రెస్ సొంత రాజకీయం కోసం ఒక్క కాళేశ్వరం స్కామ్ పై సీబీఐ విచారణ కోరిందని, రాష్ట్రంలోని మిగతా స్కామ్ లపై కూడా సీబీఐకి ఎందుకు అనుమతించడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు రెండు ఒకే కూటమిగా ఏర్పడుతాయన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ ప్రచారానికి ఓటర్ల నుంచి మంచి స్పందన లభించిందని, ఈ నియోజకవర్గానికి ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారని, వారి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదన్న ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలు వైఫల్యాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనతో జూబ్లీహిల్స్ నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఈ దఫా ఉప ఎన్నికలలో జూబ్లీహిల్సో ఉప ఎన్నికలలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీజేపీకి ఈ దఫా ఓటు వేసి గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram