KTM Duke | ప్రీమియం మోటార్ సైకిల్ తయారీ సంస్థలకు పోటీగా కేటీఎం కూడా తక్కువ సామర్థ్యం కలిగిన బైక్‌లను తీసుకొచ్చింది. ప్రముఖ స్ట్రీట్ ఫైటర్ బైక్ KTM 390 Dukeతో పాటు KTM 390 Adventure మోడళ్లకు ఇప్పుడు 350 సీసీ ఇంజిన్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు 399సీసీ ఇంజిన్‌తో ఉన్న ఈ బైక్‌ల ప్రారంభ స్థాయి ధరను తగ్గించడమే లక్ష్యంగా మార్కెట్‌లోకి ఇంజిన్ సామర్థ్యం తగ్గించి కొత్త వేరియంట్లను తెచ్చింది.
350సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న వాహనాలకు 18 శాతం జీఎస్టీ మాత్రమే వర్తిస్తుండటంతో కేటీఎం కంపెనీ ఈ పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు అందించే ఉద్దేశంతో తక్కువ ఇంజిన్ వేరియంట్లను తీసుకొచ్చింది. కాగా, 350 సీసీ ఇంజిన్ 41bhp పవర్, 33.5nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 399సీసీ LC4C ఇంజిన్‌తో పోలిస్తే 4.3bhp పవర్, 5.5 nm టార్క్ తక్కువ. అయినప్పటికీ సాధారణ వినియోగదారులకు ఇది సరిపోతుందని కంపెనీ భావిస్తోంది. ఇక రెండు బైక్‌ల్లో 6 స్పీడ్ గేర్ బాక్స్, స్లిప్పర్ క్లచ్, క్విక్ షిఫ్టర్లు వంటి ఫీచర్లు ఒకేలా ఉన్నాయి.
లుక్ పరంగా కూడా రెండూ ఆకర్షణీయంగానే కనిపిస్తాయి. అయితే స్టాండర్డ్ వేరియంట్‌లో సింపుల్ కలర్ ఆప్షన్లు, బ్లాక్ ఫ్రేమ్, బ్లాక్ వీల్స్ ఉంటాయి. 390 డ్యూక్ ఆర్‌లో మాత్రం ఆరెంజ్ ఫ్రేమ్, ఆరెంజ్ వీల్స్‌తో మరింత స్పోర్టీ లుక్‌లో కనిపిస్తుంది. బేస్ మోడల్‌పై 390 గ్రాఫిక్స్ ఉండగా.. ఆర్ వెర్షన్‌పై డ్యూక్ బ్రాండింగ్ ప్రత్యేకంగా కనిపిస్తుంది.
ధర విషయానికి వస్తే KTM 390 Adventure 350 ధర రూ.2.80 లక్షలు. ఇది 390సీసీ బైక్ ధర రూ.3.43 లక్షలతో పోలిస్తే సుమారు రూ.60 వేలు తక్కువ. కాబట్టి బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేసేవారికి 350సీసీ బైక్ మంచి ఎంపికగా ఆటో మొబైల్ నిపుణులు భావిస్తున్నారు.
Read More:
సింగిల్ చార్జింగ్‌తో 320 కి.మీ. వెళ్లొచ్చు.. ఓలా నుంచి మరో బైక్ రిలీజ్!
