వరంగల్ పై మొంథా తుఫాను పంజా!
మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ ను దాటి తెలంగాణలోకి ప్రవేశించింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి.
విధాత, వరంగల్ :
మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ ను దాటి తెలంగాణలోకి ప్రవేశించింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. దీంతో వరంగల్ నగరంతో పాటు జిల్లా మొత్తం అస్తవ్యస్తంగా మారింది. నగరంలో వర్షపు నీరు భారీగా చేరడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ చెరువుల్లా తలపిస్తున్నాయి. అండర్ బ్రిడ్జి అవతల శివనగర్ ఎస్ బీ ఐ ప్రాంతంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. డోర్నకల్ రైల్వే జంక్షన్ లోని పట్టాలు మొత్తం నీట మునిగాయి. హనుమకొండ చౌరస్తా ప్రింటింగ్ ప్రెస్ వీధి లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరం మొత్తం ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 4 గంటల వరకు వరంగల్ జిల్లాలో సుమారుగా 148.1శాతం వర్షం నమోదు అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
వరంగల్ జిల్లా మండల వారీగా నమోదైన వర్షపాతం..
గీసుకొండ – 139.3 MM
దుగ్గొండి – 55.5
నల్లబెల్లి – 36.1
నర్సంపేట – 92.5
ఖానాపూర్ – 136.5
చెన్నారావుపేట – 112.3
సంగెం – 198.2
వర్ధన్నపేట – 197.3
రాయపర్తి – 161.0
పర్వతగిరి – 193.3
నెక్కొండ – 211.1
ఖిల్లా వరంగల్ – 224.0
వరంగల్ – 168.3
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram