EC | తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఈసీ గుర్తింపు!
తెలంగాణ రాజ్యాధికార పార్టీకి గుర్తింపు దక్కింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సెక్రటరీ పేరుతో ఆ పార్టీ ప్రెసిడెంట్ కు లేఖ పంపింది. కాగా, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ రిజర్వేషన్లు, రాజ్యాధికారమే ద్యేయంగ పార్టీని స్థాపించాడు
విధాత, హైదరాబాద్ :
తెలంగాణ రాజ్యాధికార పార్టీకి గుర్తింపు దక్కింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సెక్రటరీ పేరుతో ఆ పార్టీ ప్రెసిడెంట్ కు లేఖ పంపింది. కాగా, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ రిజర్వేషన్లు, రాజ్యాధికారమే ద్యేయంగ పార్టీని స్థాపించాడు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవీర్భవించింది. పార్టీ అధ్యక్షుడిగా తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్), వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మాదం రజనీకుమార్ యాదవ్, సూదగాని హరిశంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శులుగా వట్టె జానయ్య యాదవ్, సంగెం స్యూర్యారావు, జ్యోతి పండల్, పల్లెబోయి అశోక్ యాదవ్ ఎన్నికయ్యారు. కాగా పార్టీ అధికార ప్రతినిధిగా ఏఐ(ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్)ను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు.
కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్నార్ మల్లన్న.. సొంత పార్టీతో పాటు ముఖ్యమంత్రిపై తిరగబాటు బావుటా ఎరవేశాడు. బీసీ రిజర్వేషన్ల అంశంపై సమయం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై అనేక విమర్శలు చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి తీన్నార్ మల్లన్న బీసీ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే తెలంగాణ రాజ్యాధికారం పార్టీ పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram