Supreme Court Stray Dog Case| వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు ఉత్తర్వుల సవరణ

Supreme Court Stray Dog Case| వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు ఉత్తర్వుల సవరణ

న్యూఢిల్లీ : ఢిల్లీ(Delhi)లోని వీధి కుక్కల(Stray Dogs)బెడద సమస్యపై సుప్రీంకోర్టు(Supreme), ఈ నెల 11న ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. జంతుప్రేమికుల వాదనల మేరకు గత ఉత్తర్వులను సవరించి తాజా ఉత్తర్వులు జారీ చేసింది.  వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలన్న ఉత్తర్వులలో మార్పులు చేసింది. కేవలం రేబిస్‌ ఉన్న(rabies infected dogs) వాటిని..కరిచే స్వభావం ఉన్న కుక్కలను షెల్టర్ల(shelter)కు తరలించాలని ఉత్తర్వులిచ్చింది. వీధి కుక్కలకు ఆహారం ఇచ్చేందుకు కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

వాటికి బహిరంగంగా ఆహారం పెట్టవద్దని ఆదేశించింది. కుక్కలకు టీకాలు వేయించి(vaccination), డీవార్మింగ్(deworming) చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్ లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేసింది.