Cyclone | తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారు? ఎవరు పెడతారు?
తుఫాన్లకు పేర్లు పెట్టడం వెనుక ఉద్దేశం స్పష్టమైన కమ్యూనికేషన్. తుఫాన్ ద్వారా పొంచి ఉన్న ప్రమాదాన్ని అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేస్తారు. తుఫాన్ వల్ల ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయో ఆ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తారు. అందుకే తుఫాన్లకు పేర్లు పెడతారు.
విధాత :
తుఫాన్లను సులభంగా గుర్తించడానికి వీలుగా పేర్లు పెడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన తుఫాన్ల పేర్లు ఒకే రకంగా ఉండవు. ఆయా ప్రాంతాల్లో ఏర్పడిన తుఫాన్లను ఆయా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పేరు పెడతారు. అసలు తుఫాన్లకు ఎవరు పేరు పెడతారు? ఈ పేర్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసుకుందాం.
తుఫాన్ అంటే ఏంటి?
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో తుఫాన్లకు పేరు పెట్టే విధానంలో మార్పులున్నాయి. అసలు తుఫాన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎక్కడైతే అధిక గాలులుంటే ఆ ప్రాంతాల్లో అధిక పీడనం అంటారు. అతి తక్కువ గాలులు ఉండే ప్రాంతాన్ని అల్పపీడనం అంటారు. మరో వైపు గాలుల్లో వేడి గాలి, చల్ల గాలి ఉంటాయి. వేడి గాలి తేలికగా ఉండి సులభంగా ఆకాశం వైపు వెళ్తుంది. ఇక చల్లగాలి నెమ్మదిగా భూమి వైపు పయనిస్తుంది. భూమి వాతావరణాన్ని గాలి సమీపిస్తున్నకొద్దీ ఆ గాలి చల్లబడుతుంది. గాల్లో ఉన్న ఆవిరి ఘనీభవించి మంచు స్పటికాలుగా ఏర్పడుతాయి. ఆ తర్వాత అవి మేఘాలుగా మారుతాయి. కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ మరింత గాలిని గ్రహిస్తాయి. ఈ అల్పపీడనం తీవ్రమైతే వాయుగుండంగా మారుతుంది. అది మరింత బలపడితే తుఫాన్ గా మారుతుంది. కనీసం 61 కి.మీ. వేగం లేదా 39 ఎంపీహెచ్ తో వేగం గాలులతో కూడిన తుఫాన్లు సంభవించినప్పుడే ఆ తుఫాన్లకు పేర్లు పెడుతుంటారు.
తుఫాన్లకు పేర్లు ఎందుకు?
తుఫాన్లకు పేర్లు పెట్టడం వెనుక ఉద్దేశం స్పష్టమైన కమ్యూనికేషన్. తుఫాన్ ద్వారా పొంచి ఉన్న ప్రమాదాన్ని అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేస్తారు. తుఫాన్ వల్ల ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయో ఆ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తారు. అందుకే తుఫాన్లకు పేర్లు పెడతారు. శాస్త్రవేత్తలు సులభంగా సమాచారాన్ని మార్పిడి చేసుకోవడం కోసం తుఫాన్లకు పేర్లు పెడతారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులను తుఫాన్ హెచ్చరికలు అలర్ట్ చేస్తాయి. తుఫాన్లకు అధికారిక పేర్లు పెట్టడానికి చాలా కాలం ముందే అవి తరచుగా తాకిన ప్రదేశాలతో ఆ తుపాన్లను పిలిచేవారు. 1825లో హరికేన్ శాంటా అనా లాగా. 1825, జూన్ 3-4 తేదీల్లో ఫ్లోరిడా నుంచి న్యూయార్క్ వరకు అట్లాంటిక్ తీరాన్ని తుఫాన్ తాకింది. ఈ తుఫాను మే 28న శాంటో డొమింగో సమీపంలో ఏర్పడి, జూన్ 1న క్యూబా మీదుగా కదిలింది. ఇక 20వ శతాబ్దం మధ్యలో తుఫాన్ల పేర్ల ప్రాముఖ్యతను గుర్తించారు.
పేర్లు ఎలా ఎంచుకుంటారు?
తుఫాన్ కు ప్రత్యేకమైన పేర్లు పెడతారు. ముందుగానే తయారు చేసిన పేర్ల జాబితా నుంచి పేర్లను ఎంచుకుంటారు. తుఫాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయం 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ , వరల్డ్ మెట్రాలిజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ప్రారంభించాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు వాతావరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటితోపాటు ఐదు ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరికల కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలు తుఫాన్ల హెచ్చరికలు, సూచనలు చేస్తుంటాయి. అంతేకాదు తుఫాన్లకు ఈ కేంద్రాలే పేర్లు పెడుతుంటాయి. ఈ ఆరు ప్రాంతీయ కేంద్రాల్లో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ ఐఎండీ కూడా ఒకటి. ఈ కేంద్రాలు 13 సభ్య దేశాలకు చెందిన తుఫానులకు చెందిన సమాచారం అందించడం ఈ డిపార్ట్‌మెంట్ పని. ఒక్కో దేశం 13 పేర్లతో జాబితా సిద్దం చేసింది.
2000వ సంవత్సరంలో 27వ సదస్సును మస్కట్, ఓమన్ దేశాల్లో నిర్వహించారు. ఇందులో తుఫాన్లకు పేర్లను పెట్టడంపై ఒప్పందం జరిగింది. ఇక పలుమార్లు సభ్యదేశాల మధ్య చర్చలు జరిగిన తర్వాత 2004 సెప్టెంబరులో తుఫానులకు నామకరణం చేయడం ప్రారంభమైంది. ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫానులకు పేర్లు పెట్టడం 2004 సెప్టెంబరులో మొదలైంది. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలోని 8 దేశాలైన బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుఫాన్లకు పేర్లు పెట్టారు. అట్లాంటిక్ తుఫానులకు ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) కు చెందిన హరికేన్ కమిటీ పేర్లు పెడుతుంది. పసిఫిక్ తుఫానులకు ఆసియా దేశాలు అందించిన జాబితా నుండి పేర్లు పెడతారు. ఇవి స్థానిక భాషలు, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ఉదాహరణకు 2012లో టైఫూన్ టెంబిన్ అనే పదానికి తుల అనే జపనీస్ పదం పేరు పెట్టారు. హిందూ మహాసముద్రంలో వచ్చే తుఫానులకు భారతదేశం, బంగ్లాదేశ్, ఒమన్ వంటి దేశాలు పేర్లు పెడతాయి. 2019లో దక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాలను నాశనం చేసిన తుఫాను ఫణి పేరును బంగ్లాదేశ్ పెట్టింది.
స్థానిక భాషల్లో ప్రసిద్ది పొందిన పేర్లు
ప్రతి ప్రాంతానికి ప్రత్యేకతలుంటాయి. భౌగోళికంగా, చారిత్రకంగా ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అస్ట్రేలియా దేశంలో స్థానిక భాషల నుండి ప్రేరణ పొందిన పేర్లను తుఫాన్లకు ఉపయోగిస్తారు. వర్ణమాల ప్రకారంగా పేర్లను ఎంచుకుంటారు. ఒక్కసారి ఉపయోగించినే పేర్లను మరోసారి వాడరు. అట్లాంటిక్ మహాసముద్రంలో పుట్టే తుఫాన్లకు మానవ పేర్లు ఉంటాయి. పసిఫిక్ మహాసముద్రంలో పుట్టే సైక్లోన్లకు ప్రకృతి దృశ్యాల పేర్లు ఉంటాయి. ఇండియాలో తుఫాన్లకు ప్రాంతీయ భాషల పేర్లు ఉపయోగిస్తారు.
తుఫాన్లకు పేర్లు పెట్టడంలో నిబంధనలు ఇవీ…
ఈ తుఫాన్ల పేర్లు పెట్టడానికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి.ఇష్టానుసారం తుఫాన్లకు పేర్లు పెట్టవద్దు.
రాజకీయ, మత, సాంస్కృతిక , లింగ భేదాలు, చిహ్నాలకు అతీతంగా పేర్లు ఉండాలి.
క్రూరత్వాన్ని సూచించేలా తుఫాన్ల పేర్లు ఉండవద్దు.
ఏ వర్గం మనోభావాలు దెబ్బతినకుండా తుఫాన్ల పేర్లు ఉండాలి.
సులభంగా గుర్తు పెట్టుకొనేలా పేర్లు ఉండాలి.
ఇంగ్లీషులో ఎనిమిది అక్షరాలకంటే ఎక్కువ ఉండవద్దు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram