full-scale solar village । పూర్తిస్థాయి సోలార్ విలేజ్‌గా కొండారెడ్డి పల్లిని ఎందుకు ఎంచుకున్నారంటే?

పూర్తిగా సౌర విద్యుత్తుతో నడిచే గ్రామంగా కొండారెడ్డి పల్లిని అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు ఎస్పీడీసీఎల్‌ అధికారులు మంగళవారం ఆ గ్రామాన్ని సందర్శించారు.

full-scale solar village । పూర్తిస్థాయి సోలార్ విలేజ్‌గా కొండారెడ్డి పల్లిని ఎందుకు ఎంచుకున్నారంటే?

full-scale solar village । రాష్ట్రంలో పూర్తి స్థాయి సోలార్ విలేజ్ గా కొండారెడ్డి పల్లిని మోడల్ విలేజ్ గా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు మంగళవారం కొండారెడ్డి పల్లి కి వెళ్లి పరిశీలించారు. సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, బి సంతోష్, రెడ్కో VC అండ్ MD, అనిల, సంస్థ డైరెక్టర్ కమర్షియల్, కె రాములులు ఇతర శాఖల అధికారులతో కలిసి కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటిస్తూ పలువురు గ్రామస్తులు, రైతులు, ప్రజాప్రతినిధులకు ఈ పైలట్ ప్రాజెక్ట్ వివరాలు తెలియజేశారు.

గ్రామంలో దాదాపు 499 గృహ వినియోగదారులు, 66 వాణిజ్య వినియోగదారులు, 867 వ్యవసాయ వినియోగదారులు, ఇతర కాటగిరీలతో కలుపుకుని మొత్తం 1451 వినియోగదారులు ఉన్నారు.  ఈ మోడల్ ప్రాజెక్ట్ అమలు చేయడం కోసం గ్రామంలో ఇంటింటి సర్వే చేశారు. సర్వే ద్వారా గ్రామానికి అవసరమైన సౌర విద్యుత్ కెపాసిటీని అంచనా వేసి DPR రూపొందించి, తదుపరి ప్రక్రియ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పుట్టిన ఊరైన కొండారెడ్డి పల్లికి సోలార్ విద్యుత్ అందించి, మిగతా అన్ని గ్రామాలకు మార్గదర్శకం చేయాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు చెపుతున్నారు.