ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ విడుదల చేశారు. టెన్త్ ఫలితాల్లో 86.69 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు
AP SSC Results 2024 released
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ విడుదల చేశారు. టెన్త్ ఫలితాల్లో 86.69 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. బాలురు 84.34 శాతం, బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2,300 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 17 పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.07 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కర్నూల్ జిల్లాలో అత్యల్పంగా 67 శాతం నమోదైంది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తంగా 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల కోసం www.bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram