America | అమెరికాలో ఘ‌నంగా గురు పూర్ణిమ ఉత్స‌వాలు.. 10 వేల మంది భ‌గ‌వ‌ద్గీత పారాయ‌ణ‌

గురు పూర్ణిమ వేడుక‌లు అమెరికా (America) లో ఘ‌నంగా జ‌రిగాయి. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా తొలిసారి సుమారు 10 వేల మంది సామూహికంగా జ‌గ‌ద్గురువు శ్రీ కృష్ణుడు ప్ర‌వ‌చించిన భ‌గ‌వ‌ద్గీత ను పారాయ‌ణం చేశారు. టెక్సాస్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని యోగా సంగీత ట్ర‌స్ట్ అమెరికా, ఎస్‌జీఎస్ గీతా ఫౌండేష‌న్ సంయుక్తంగా నిర్వ‌హించాయి. In a remarkable event on Guru Purnima, ten thousand people gathered at Allen East Center in […]

  • By: Somu    latest    Jul 04, 2023 10:54 AM IST
America | అమెరికాలో ఘ‌నంగా గురు పూర్ణిమ ఉత్స‌వాలు.. 10 వేల మంది భ‌గ‌వ‌ద్గీత పారాయ‌ణ‌

గురు పూర్ణిమ వేడుక‌లు అమెరికా (America) లో ఘ‌నంగా జ‌రిగాయి. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా తొలిసారి సుమారు 10 వేల మంది సామూహికంగా జ‌గ‌ద్గురువు శ్రీ కృష్ణుడు ప్ర‌వ‌చించిన భ‌గ‌వ‌ద్గీత ను పారాయ‌ణం చేశారు. టెక్సాస్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని యోగా సంగీత ట్ర‌స్ట్ అమెరికా, ఎస్‌జీఎస్ గీతా ఫౌండేష‌న్ సంయుక్తంగా నిర్వ‌హించాయి.

ఈ కార్య‌క్ర‌మానికి విశిష్ఠ అతిథిగా గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామి హాజ‌ర‌య్యారు. కాగా అజ్ఞానాంధ‌కారాల్ని తొల‌గించే గురువుని పూజించ‌డ‌మే గురు పూర్ణిమ ప్ర‌ధాన ఉద్దేశం. ఈ పండ‌గ‌ను భార‌త్‌తో పాటు నేపాల్‌, భూటాన్‌లలోనూ జ‌రుపుకొంటారు. గురు పూర్ణిమ‌కు స‌నాత‌న ధ‌ర్మంతో పాటు బుద్ధిజం, జైనిజంల‌లో కూడా విశిష్ఠ స్థానం ఉంది