ఆఫ్తాబ్‌ను 70 ముక్కలుగా నరికేస్తాం.. కత్తులతో వెంబడించిన ఇద్దరు అరెస్ట్
Shraddha Walkar | ముంబై నగరానికి చెందిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. శ్రద్ధాను హత్య చేసిన ఆఫ్తాబ్ అమీన్ పూనావాల తీహార్ జైల్లో ఉంటున్నాడు. అయితే సోమవారం పాలిగ్రాఫ్ టెస్ట్ నిమిత్తం ఆఫ్తాబ్‌ను తీహార్ జైలు నుంచి ఢిల్లీలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పోలీసులు తరలించారు. ఈ సమయంలో ఫోరెన్సిక్ ల్యాబ్ వద్దకు దాదాపు 15 మంది యువకులు వచ్చారు. ఇక ఆఫ్తాబ్‌ను పోలీసు వాహనంలో తీహార్ జైలుకు […]

Shraddha Walkar | ముంబై నగరానికి చెందిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. శ్రద్ధాను హత్య చేసిన ఆఫ్తాబ్ అమీన్ పూనావాల తీహార్ జైల్లో ఉంటున్నాడు. అయితే సోమవారం పాలిగ్రాఫ్ టెస్ట్ నిమిత్తం ఆఫ్తాబ్‌ను తీహార్ జైలు నుంచి ఢిల్లీలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పోలీసులు తరలించారు. ఈ సమయంలో ఫోరెన్సిక్ ల్యాబ్ వద్దకు దాదాపు 15 మంది యువకులు వచ్చారు.
ఇక ఆఫ్తాబ్‌ను పోలీసు వాహనంలో తీహార్ జైలుకు తరలిస్తుండగా, ఆ యువకులు అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కత్తులతో పోలీసు వాహనాన్ని వెంబడించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం కుల్దీప్ ఠాకూర్, నిగం గుర్జార్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జడ్జి ఎదుట ప్రవేశపెట్టి జైలుకు తరలించారు.
అయితే ఆఫ్తాబ్‌పై దాడికి ప్రయత్నించిన సమయంలో ఓ యువకుడు మాట్లాడుతూ.. మా సోదరి శ్రద్ధా వాకర్‌ను ఆఫ్తాబ్ అతి కిరాతకంగా చంపేశాడు. ఆమెను 35 ముక్కలుగా నరికాడు. తాము ఆఫ్తాబ్‌ను 70 ముక్కలుగా నరికేస్తాం. అతన్ని వదలబోమని ఆ యువకుడు మీడియాకు వెల్లడించాడు.
ఈ పరిణామాల నేపథ్యంలో తీహార్ జైలు వద్ద బందోబస్తు పెంచాలని జైలు అధికారులు ఢిల్లీ పోలీసులను కోరారు. బెటాలియన్‌ను బందోబస్తులో ఉంచితే మంచిదని భావించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు.