కూతురికి అనారోగ్యం.. మానవ పుర్రె కోసం శ్మశానవాటికలో తవ్వకాలు
Human Skull | అనారోగ్యానికి గురైతే ఆస్పత్రికి వెళ్తాం.. డాక్టర్ సూచనల మేరకు మెడిసిన్స్ వాడుతాం. కానీ ఓ వ్యక్తి మాత్రం తన కూతురు అనారోగ్యం బారిన పడితే.. ఓ తాంత్రికుడి వద్దకు వెళ్లాడు. ఆమెకు పట్టిన దుష్ట శక్తులు పోవాలంటే.. మానవ పుర్రె అవసరమని తండ్రికి తాంత్రికుడు చెప్పాడు. దీంతో తండ్రి మరొకరి సహాయంతో ఓ శ్మశానవాటికకు వెళ్లి.. మానవ పుర్రె కోసం తవ్వుతుండగా స్థానికులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా అరుహాబాద్ […]

Human Skull | అనారోగ్యానికి గురైతే ఆస్పత్రికి వెళ్తాం.. డాక్టర్ సూచనల మేరకు మెడిసిన్స్ వాడుతాం. కానీ ఓ వ్యక్తి మాత్రం తన కూతురు అనారోగ్యం బారిన పడితే.. ఓ తాంత్రికుడి వద్దకు వెళ్లాడు. ఆమెకు పట్టిన దుష్ట శక్తులు పోవాలంటే.. మానవ పుర్రె అవసరమని తండ్రికి తాంత్రికుడు చెప్పాడు. దీంతో తండ్రి మరొకరి సహాయంతో ఓ శ్మశానవాటికకు వెళ్లి.. మానవ పుర్రె కోసం తవ్వుతుండగా స్థానికులు పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా అరుహాబాద్ గ్రామానికి చెందిన ఓ చిన్నారి ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆ చిన్నారి తండ్రి తాంత్రికుడిని సంప్రదించాడు. చిన్నారిని దుష్ట శక్తులు ఆవహించాయని, వాటిని వదిలించాలంటే మానవ పుర్రె అవసరమని తాంత్రికుడు సూచించాడు. 11 రోజుల క్రితం చనిపోయిన ఓ వ్యక్తిని స్థానిక శ్మశానవాటికలో పూడ్చి పెట్టారు.
ఈ విషయం తెలుసుకున్న తండ్రి మరొకరి సహాయంతో ఆదివారం రాత్రి శ్మశానవాటికకు వెళ్లాడు. పుర్రె కోసం తవ్వకాలు జరుపుతుండగా, గ్రామస్తులు గమనించారు. అనంతరం వారిద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.