28 ఏండ్లకే 24 మందిని పెళ్లి చేసుకున్నాడు.. ఎందుకంటే..?
విధాత: ఏ కష్టం చేయకుండా డబ్బు సంపాదించాలనుకున్నాడు.. విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకున్నాడు. అదేలా సాధ్యమవుతుందని ఆలోచించాడు. అతనికి కనిపించిన మార్గం ఒక్కటే.. అదేంటంటే.. పెళ్లిళ్లు చేసుకోవడమే. వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించి.. హ్యాపీగా బతకాలని అనుకున్నాడు. ఇంకేముందీ.. ఆ ప్లాన్‌ను అమలు చేశాడు. 28 ఏండ్లకే 24 మంది మహిళలను పెళ్లి లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను దొంగిలించాడు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసబుల్ మొల్లా(28) అనే యువకుడు రోడ్డు […]

విధాత: ఏ కష్టం చేయకుండా డబ్బు సంపాదించాలనుకున్నాడు.. విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకున్నాడు. అదేలా సాధ్యమవుతుందని ఆలోచించాడు. అతనికి కనిపించిన మార్గం ఒక్కటే.. అదేంటంటే.. పెళ్లిళ్లు చేసుకోవడమే. వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించి.. హ్యాపీగా బతకాలని అనుకున్నాడు. ఇంకేముందీ.. ఆ ప్లాన్‌ను అమలు చేశాడు. 28 ఏండ్లకే 24 మంది మహిళలను పెళ్లి లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను దొంగిలించాడు.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసబుల్ మొల్లా(28) అనే యువకుడు రోడ్డు నిర్మాణ కార్మికుడిగా జీవనం కొనసాగించేవాడు. అక్కడ పరిచయమైన మహిళలతో తాను అనాథనని చెప్పుకునేవాడు. అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వారిని వివాహం చేసుకునేవాడు.
ఫేక్ ఐడీ కార్డులతో ఏకంగా 24 మందిని పెళ్లి చేసుకున్నాడు. మహిళలతో కొన్ని వారాలతో కాపురం చేసేవాడు. నమ్మకం కుదిరాక.. వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించేవాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాప్ చేసేవాడు.
ఓ మహిళ ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసబుల్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అరెస్టు చేశారు. కష్టపడకుండా, విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఈ రకంగా చేశానని అసబుల్ పోలీసుల విచారణలో పేర్కొన్నాడు.