Sweet City of India | స్వీట్‌ సిటీ ఆఫ్‌ ఇండియా అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..?

భారతదేశపు 'స్వీట్ సిటీ' కోల్‌కతా! రసగుల్లా నుండి మిష్టి దోయి వరకు.. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన బెంగాలీ తీపి వంటకాల విశేషాలు మరియు వాటి లెగసీ గురించి ఇక్కడ తెలుసుకోండి.

Sweet City of India | స్వీట్‌ సిటీ ఆఫ్‌ ఇండియా అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..?

Sweet City of India | ఇండియా క్యాపిటల్‌ ఏది..? అంటే ‘న్యూ ఢిల్లీ’ అని టక్కున సమాధానం వస్తుంది. అదే ఆర్థిక రాజధాని అంటే ముంబై అని చెప్తారు. అలానే ‘స్వీట్స్‌ క్యాపిటల్‌’ కూడా ఉందన్న విషయం మీకు తెలుసా..? అవును మీరు విన్నది నిజమే. మన దేశంలో స్వీట్లకు ఓ నగరం చాలా ఫేమస్‌. దాన్ని ‘స్వీట్‌ సిటీ ఆఫ్‌ ఇండియా‌’ (Sweet City of India), ‘స్వీట్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’ అని కూడా పిలుస్తారు.

భారతీయులకు స్వీట్లంటే మక్కువ. పండుగ, వేడుక ఏదైనా సరే కచ్చితంగా స్వీట్‌ ఉండాల్సిందే. శుభవార్తను కూడా స్వీట్‌తోనే పంచుకుంటారు. అయితే ఒక్కో ప్రాంతం ఒక్కో స్వీట్‌కు ప్రసిద్ధి. ప్రతి ప్రాంతం తనదైన స్వీట్స్‌తో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అయితే, భారతదేశ స్వీట్‌ లెగసీలో పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతా (Kolkata)కు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. తన గొప్ప వంటకాల చరిత్ర, సంప్రదాయ రుచులు, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌ అయిన డిజర్ట్స్‌తో ఈ నగరం ‘సిటీ ఆఫ్ స్వీట్స్ ఇండియా’గా పేరొందింది.

సాధారణంగానే కోల్‌కతా బెంగాలీ స్వీట్స్‌కు ప్రసిద్ధి. ఆ నగరం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే స్వీట్‌ రసగుల్లా. దీంతోతోపాటూ మరికొన్ని స్వీట్స్‌ కూడా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ లిస్ట్‌లో ఉన్నాయి. అవే బెంగాలీ సందేష్‌‌, మిష్టి దోయి‌, చామ్ చమ్, నోలెన్ గుర్. ఇవి పండుగలు, శుభకార్యాల్లో తప్పనిసరిగా ఉంటాయి. ముఖ్యంగా దుర్గా పూజ, దీపావళి సమయంలో ఎక్కువగా తింటారు. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం..

1.రసగుల్లా..

రసగుల్లా బెంగాల్‌ స్వీట్స్‌లోకెల్లా కింగ్‌గా నిలిచింది. దీన్ని తాజా పనీర్‌తో తయారు చేస్తారు. తెల్లగా, గుండ్రంగా ఉంటాయి. చలా పాఫ్ట్‌గా, స్పంజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. వీటిని గులాబ్‌జామూన్‌ తరహాలోనే షుగర్‌ సిరప్‌తో కలిపి తీసుకుంటారు.

2. బెంగాలీ సందేష్‌

ఇది కూడా చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉంటుంది. దీన్ని కూడా షుగర్‌తోనే తాయరు చేస్తారు. ఇది పిస్తా, చాక్లెట్‌, కుంకుమపువ్వు వంటి ఫ్లేవర్స్‌తో దొరుకుతుంది. దీన్ని బెంగాలీలు చాలా ఇష్టంగా తింటారు. శుభకార్యాలు, వేడుకల్లో మెనూలో భాగం చేస్తారు.

3. మిష్టి దోయి (తీపి పెరుగు)

ఇది కారామెలైజ్డ్ స్వీట్‌ పెరుగు. బెంగాలీ ఇళ్లలో ప్రధానమైన స్వీట్‌ రెసిపీ. మట్టి కుండలలో పాలు, చక్కెరను నెమ్మదిగా మరిగించి పెరుగు టెక్చర్‌ వచ్చేలా తయారు చేస్తారు. ఇది చాలా ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది.

4. చామ్ చమ్

ఇది ఓవల్ ఆకారంలో ఉంటుంది. దీన్ని పన్నీర్‌తో ప్రత్యేకంగా తయారు చేసి.. చక్కెర పానకంలో ముంచుతారు. ఆపై కొబ్బరి పొడిని చల్లుతారు. పండగ సమయాల్లో బెంగాలీ ఇళ్లలో ఈ స్వీట్‌ తప్పకుండా ఉంటుంది.

5. నోలెన్ గుర్

శీతాకాలంలో ఈ స్వీట్‌ ఎక్కువగా దొరుకుతుంది. దీన్ని ఖర్జూర బెల్లంతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ సీజన్‌లో ఇది అక్కడ స్పెషల్‌ స్వీట్‌.