Mohammed Shami  | మహ్మద్​ షమీకి హైకోర్టు షాక్​.. కూతురుకు నెలకు 2.5 లక్షలు – భార్యకు 1.5 లక్షలు భరణం

షమీపై గతంలో మ్యాచ్‌ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. హసీన్ చేసిన ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ యాంటీ-కరప్షన్ యూనిట్ విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఒక్క పేసర్‌గా కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ షమీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు.

Mohammed Shami  | మహ్మద్​ షమీకి హైకోర్టు షాక్​.. కూతురుకు నెలకు 2.5 లక్షలు – భార్యకు 1.5 లక్షలు భరణం

Mohammed Shami  | టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి కోల్​కతా హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ‘గృహహింస నివారణ చట్టం’ కింద భార్య హసీన్ జహాన్ దాఖలు చేసిన కేసులో, కోర్టు షమీకి నెలకు రూ.4 లక్షల భరణం చెల్లించాలంటూ ఆదేశించింది. ఇందులో భార్య హసీన్‌కు రూ.1.50 లక్షలు, కుమార్తె ఆయరాకు రూ.2.50 లక్షల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా, ఈ మొత్తాన్ని గత ఏడేళ్ల నుంచి లెక్కించి చెల్లించాలన్న తీర్పు షమీకి భారీ ఆర్థిక భారాన్ని మోపనుంది. అంతేకాకుండా, ఈ కేసును క్రిందస్థాయి న్యాయస్థానం ఆరు నెలల్లోపుగా పూర్తిచేయాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది.

గతంలోనూ షమీ(Mohammed Shami) కుటుంబ జీవితం వివాదాలతో నిండి ఉంది. భార్య హసీన్ జహాన్(Hasin Jahan) పలు సందర్భాల్లో షమీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత ఏడాది షమీ తన కుమార్తె ఆయరా(Aaira)తో ఎమోషనల్‌గా కలిసిన సమయంలోనూ హసీన్ తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్లో షమీ తన కుమార్తెతో షాపింగ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయగా, “ఇది అన్నీ నాటకీయమే. షమీ సంతకం అవసరంగా ఉండడంతోనే కుమార్తె ఆయరా అతన్ని కలుసుకుంది. కానీ తను సంతకం కూడా పెట్టలేదు. షాపింగ్​లో కూడా ఆమె కోరిన గిటార్‌, కెమెరా వంటి వాటిని కూడా కొనివ్వలేదు” అంటూ హసీన్ జహాన్ మీడియాతో ఆరోపించారు.

అంతేకాకుండా, షమీపై గతంలో మ్యాచ్‌ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. హసీన్ చేసిన ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ యాంటీ-కరప్షన్ యూనిట్ విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఒక్క పేసర్‌గా కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ షమీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. కాగా, షమీ ఇప్పటివరకు 64 టెస్టులు, 108 వన్డేలు, 25 టి20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం కలిగిన సీనియర్ క్రికెటర్. ప్రస్తుతం భారత జట్టులో లేకపోయినా, తన వ్యక్తిగత జీవితంపై మాత్రం మళ్లీ అందరి దృష్టి మళ్లడం ఆయనకు తలనొప్పిగా మారింది. ఇప్పుడు కోర్టు తీర్పుతో అతని ఆర్థిక కష్టాలు మరింతగా పెరిగిపోయాయి.