America | అమెరికాలో కాల్పులు.. ముగ్గురు న‌ల్ల‌ జాతీయులు మృతి

America | అమెరికాలో మ‌రోసారి కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్స‌న్‌విల్లెలో ఉన్న డాల‌ర్ జ‌న‌ర‌ల్ స్టోర్ వ‌ద్ద ఓ దుండ‌గుడు జ‌రిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురు కూడా న‌ల్ల‌జాతీయులే. కాల్పుల స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. అంత‌లోనే కాల్పులు జ‌రిపిన దుండ‌గుడు స్టోర్‌లోకి చొర‌బ‌డ్డాడు. దీంతో ఆ దుండ‌గుడిపై పోలీసులు కాల్పులు జ‌ర‌ప‌గా, అత‌ను మృతి చెందాడు. శ‌నివారం మ‌ధ్యాహ్నం ఏఆర్-15 స్టైల్ రైఫిల్‌తో పాటు మ‌రో […]

  • By: raj    latest    Aug 27, 2023 1:29 AM IST
America | అమెరికాలో కాల్పులు.. ముగ్గురు న‌ల్ల‌ జాతీయులు మృతి

America |

అమెరికాలో మ‌రోసారి కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్స‌న్‌విల్లెలో ఉన్న డాల‌ర్ జ‌న‌ర‌ల్ స్టోర్ వ‌ద్ద ఓ దుండ‌గుడు జ‌రిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురు కూడా న‌ల్ల‌జాతీయులే.

కాల్పుల స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. అంత‌లోనే కాల్పులు జ‌రిపిన దుండ‌గుడు స్టోర్‌లోకి చొర‌బ‌డ్డాడు. దీంతో ఆ దుండ‌గుడిపై పోలీసులు కాల్పులు జ‌ర‌ప‌గా, అత‌ను మృతి చెందాడు.

శ‌నివారం మ‌ధ్యాహ్నం ఏఆర్-15 స్టైల్ రైఫిల్‌తో పాటు మ‌రో హ్యాండ్ గ‌న్‌తో స్టోర్ వ‌ద్ద‌కు వ‌చ్చిన దుండ‌గుడు.. పార్కింగ్ ప్రాంతంలో క‌నిపించిన న‌ల్ల జాతీయుల‌పై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపాడు. మృతుల్లో ఇద్ద‌రు పురుషులు, ఒక‌రు మ‌హిళ ఉన్నారు. జాత్యాహంకారంతోనే దుండ‌గుడు వారిపై కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు తెలిపారు.