Hyderabad | CBIT కాలేజీ వద్ద ఘోర ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి
Hyderabad | CBIT నార్సింగి సమీపంలోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(CBIT) వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న కారును వెనుక వచ్చిన వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో కారు ఓ లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను […]

Hyderabad | CBIT
నార్సింగి సమీపంలోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(CBIT) వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న కారును వెనుక వచ్చిన వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో కారు ఓ లారీ కిందకు దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.