Human Skulls | పుర్రెలు, వెన్నెముకలు, తుంటి ఎముకలతో ఇంటి అలంకరణ
Human Skulls | ఎవరైనా తమ ఇంటిని అధునాతన సదుపాయాలతో నిర్మించుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన ఇంటిని మనషులు పుర్రెలు, వెన్నెముకలతో అలంకరించుకున్నాడు. కూర్చునే కుర్చీ నుంచి మొదలుకుంటే పడుకునే మంచం వరకు.. ఇంటి మొత్తాన్ని 40 పుర్రెలతో అలకరించాడు. ఈ ఘటన అమెరికాలోకి కెంటకీ రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ శవాగారంలో కొన్ని మానవ శరీర అవయవాలు మాయమయ్యాయి. దీంతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) […]
Human Skulls | ఎవరైనా తమ ఇంటిని అధునాతన సదుపాయాలతో నిర్మించుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన ఇంటిని మనషులు పుర్రెలు, వెన్నెముకలతో అలంకరించుకున్నాడు. కూర్చునే కుర్చీ నుంచి మొదలుకుంటే పడుకునే మంచం వరకు.. ఇంటి మొత్తాన్ని 40 పుర్రెలతో అలకరించాడు. ఈ ఘటన అమెరికాలోకి కెంటకీ రాష్ట్రంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్ శవాగారంలో కొన్ని మానవ శరీర అవయవాలు మాయమయ్యాయి. దీంతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా 39 ఏండ్ల వయసున్న జేమ్స్ నాట్ అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆయన ఇంట్లో సోదాలు చేసే ముందు.. ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? అని అధికారులు నాట్‌ను ప్రశ్నించగా, కేవలం చనిపోయిన నా స్నేహితులు మాత్రమే ఉన్నారని బదులిచ్చాడట.
జేమ్స్ ఇంట్లోకి అడుగుపెట్టిన అధికారులు.. షాక్ అయ్యారు. ఇంటి నిండా పుర్రెలు, వెన్నెముకలు, తొడ, తుంటి ఎముకలు ఉన్నాయి. వీటన్నింటిని అందంగా అలంకరించాడు. మంచాన్ని కూడా మానవ అవశేషాలతో అలకరించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆ ఇంట్లో హార్వర్డ్ మెడికల్ స్కూల్ బ్యాగ్ కూడా లభించింది. ఈ ఆధారాలన్నింటిని అధికారులు కోర్టుకు సమర్పించారు. అయితే హార్వర్డ్ మెడికల్ స్కూల్ శవాగారంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి సహాయంతో జేమ్స్ నాట్ మానవ అవశేషాలను విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram