రేపటి నుంచి 5జీ.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

విధాత‌, ఢిల్లీ: దేశంలో 5జీ సర్వీస్‌ల లాంచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు 5జీ సర్వీస్‌లను ప్రారంభించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరగనున్న ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో 5జీని లాంచ్ చేయనున్నారు. ప్ర‌ధాని మోదీ. టెలికం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా చైర్మన్లు ఈ ఈవెంట్‌కు హాజరు కానున్నారు. దేశ టెక్నాలజీ ప్రస్థానంలో ఇది ఒకానొక కీలకమైన రోజుగా ఉండనుంది. మరోవైపు అక్టోబర్ నెలలోనే టెలికం సంస్థలు కమర్షియల్‌‌గా […]

  • By: Somu |    latest |    Published on : Sep 30, 2022 11:39 AM IST
రేపటి నుంచి 5జీ.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

విధాత‌, ఢిల్లీ: దేశంలో 5జీ సర్వీస్‌ల లాంచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు 5జీ సర్వీస్‌లను ప్రారంభించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరగనున్న ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో 5జీని లాంచ్ చేయనున్నారు.

ప్ర‌ధాని మోదీ. టెలికం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా చైర్మన్లు ఈ ఈవెంట్‌కు హాజరు కానున్నారు. దేశ టెక్నాలజీ ప్రస్థానంలో ఇది ఒకానొక కీలకమైన రోజుగా ఉండనుంది. మరోవైపు అక్టోబర్ నెలలోనే టెలికం సంస్థలు కమర్షియల్‌‌గా 5జీ నెట్‌వర్క్ రోల్అవుట్‌ను ప్రారంభించనున్నాయి.

అక్టోబర్‌లో 5జీ నెట్‌వర్క్‌ను కొన్ని ప్రధాన మెట్రో నగరాల్లో జియో, ఎయిర్‌టెల్ లాంచ్ చేయనున్నాయి. క్రమంగా మిగిలిన నగరాలకు విస్తరిస్తాయి. మొత్తంగా రెండేళ్లలో దేశమంతా 5జీ సేవలను అందించాలని టెలికం సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే ఆ సంస్థలు వెల్లడించాయి.