Barack Obama aliens comments| ఏలియన్స్ ఉన్నారు..అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా వ్యాఖ్యలు వైరల్
ఏలియన్స్ (గ్రహంతర వాసులు) ఉనికికి సంబంధించిన వార్తలు, ఊహాగానాలు.. ఎగిరే వస్తువుల సమాచారం ఎప్పుడొచ్చిన అందరూ ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబమా ఏలియన్స్ ఉనికిపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఏలియన్స్ ఉనికి నిజమని, విశ్వంలోని ఏదో ఒక గ్రహంపై గ్రహాంతర వాసులు ఉండే విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నానని ఒబామా పేర్కొన్నారు.
విధాత : ఏలియన్స్ (గ్రహంతర వాసులు) ఉనికికి సంబంధించిన వార్తలు, ఊహాగానాలు.. ఎగిరే వస్తువుల సమాచారం ఎప్పుడొచ్చిన అందరూ ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబమా ఏలియన్స్ ఉనికిపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఎలియన్స్ ఉన్నారని.. వారి ఉనికిని నేను నమ్ముతున్నానని ఒబామా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్య్వూలో పేర్కొన్నారు.
దశాబ్దం క్రితం అమెరికా ఎయిర్ ఫోర్స్ రీపర్ డ్రోన్లు సేకరించిన రాడార్ రికార్డింగ్‌లలో మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలపై అసాధారణ జీవులు, ఎగిరే వస్తువులు(ఫ్లైయింగ్ సాసర్స్) కనిపించాయని నివేదించాయి. ఏలియన్స్‌ను అమెరికా మిలటరీ రహస్య ప్రాంతం ఏరియా 51లో నిర్భంధించారన్న కథనాలు సైతం తరుచూ వెలుగుచూస్తున్నాయి. ఈ కథనాలపై ఒబామా ఇంటర్య్వూలో స్పందించారు. ఇలాంటి ఊహాగానాల్లో నిజం లేదని స్పష్టం చేశారు. దీనిని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవన్నారు. గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించిన పలు రికార్డులు అమెరికా ప్రభుత్వం దగ్గర ఉన్నట్లు తాను అధికారంలో ఉన్న సమయంలో కూడా సమాచారం లేదని స్పష్టం చేశారు.
అయితే ఏలియన్స్ ఉనికి నిజమని, విశ్వంలోని ఏదో ఒక గ్రహంపై గ్రహాంతర వాసులు ఉండే విషయాన్ని తాను బలంగా నమ్ముతున్నానని ఒబామా పేర్కొన్నారు. అకాశంలో కనిపించే గుర్తు తెలియని వస్తువులు(యూఎఫ్ వోస్) కదలికలు రహస్యంగా వాటి మిస్టరీ చేధించే పరిశోధనలు సాగుతున్నాయని తెలిపారు. ఏలియన్స్ ఉన్నారంటూ ఒబామా తాజాగా వ్యక్తం చేసిన అభిప్రాయంతో అంతర్జాతీయంగా ఏలియన్స్ ఉనికిపై మరోసారి హాట్ హాట్ చర్చలకు తెరలేసినట్లయ్యింది.
Obama Drops Bombshell: Aliens Are Real, But Not Hiding in Area 51
Barack Obama on aliens: “They’re real, but I haven’t seen them. They’re not being kept at Area 51. There’s no underground facility unless there’s this enormous conspiracy and they hid it from the President of the… pic.twitter.com/A0cVMd5in5
— Soumyajit Pattnaik (@soumyajit) February 15, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram