Pakistan | పాకిస్తాన్‌లో దారుణం: పెళ్లి వేడుక‌లో ఘ‌ర్ష‌ణ‌.. ఒకే కుటుంబంలో 9 మంది హ‌త్య‌

Pakistan | పాకిస్తాన్‌లోని ప‌క్తున్‌ఖ‌వా ప్రావిన్స్‌లో దారుణం జ‌రిగింది. ఓ పెళ్లి వేడుక‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌క్తున్‌ఖ‌వా ప్రావిన్స్‌లోని మ‌ల‌కండ్ జిల్లా బ‌త్కేలా త‌హ‌సీల్ ప‌రిధిలో బుధ‌వారం ఓ పెళ్లి వేడుక జ‌రిగింది. అయితే ఈ వేడుక‌లో గొడ‌వ చోటు చేసుకుంది. అనంత‌రం ఒకే కుటుంబానికి చెందిన 9 మంది గాఢ నిద్ర‌లో ఉండ‌గా, వారిపై […]

  • Publish Date - June 28, 2023 / 11:28 AM IST

Pakistan | పాకిస్తాన్‌లోని ప‌క్తున్‌ఖ‌వా ప్రావిన్స్‌లో దారుణం జ‌రిగింది. ఓ పెళ్లి వేడుక‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘ‌ట‌న బుధ‌వారం చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌క్తున్‌ఖ‌వా ప్రావిన్స్‌లోని మ‌ల‌కండ్ జిల్లా బ‌త్కేలా త‌హ‌సీల్ ప‌రిధిలో బుధ‌వారం ఓ పెళ్లి వేడుక జ‌రిగింది. అయితే ఈ వేడుక‌లో గొడ‌వ చోటు చేసుకుంది.

అనంత‌రం ఒకే కుటుంబానికి చెందిన 9 మంది గాఢ నిద్ర‌లో ఉండ‌గా, వారిపై తుపాకీతో కాల్పులు జ‌రిపి మ‌ట్టుబెట్టారు. మృతుల్లో ముగ్గురు మ‌హిళ‌లు, ఆరుగురు పురుషులు ఉన్నారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. జిల్లా స‌రిహ‌ద్దుల్లో చెక్‌పోస్టుల‌ను ఏర్పాటు చేశారు. పెళ్లి వేడుక‌లో చోటు చేసుకున్న వివాదాలే ఈ హ‌త్య‌ల‌కు దారి తీసిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాల‌ను బ‌త్కెలా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.

Latest News