Delhi Court | ఢిల్లీ కోర్టులో మ‌హిళ‌పై నాలుగు రౌండ్ల‌ కాల్పులు..

Delhi Court | దేశ రాజ‌ధాని ఢిల్లీలోని సాకేత్ కోర్టు కాంప్లెక్స్‌లో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. లాయ‌ర్ వేష‌ధార‌ణ‌లో కోర్టులోకి ప్ర‌వేశించిన ఓ దుండ‌గుడు.. అక్క‌డున్న ఓ మ‌హిళ‌పై తుపాకీతో నాలుగు రౌండ్ల కాల్పులు జ‌రిపాడు. దీంతో కోర్టు కాంప్లెక్స్‌లో ఉన్న పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న బాధిత మ‌హిళ‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. LG साहिब, ये हमारी दिल्ली में क्या […]

Delhi Court | ఢిల్లీ కోర్టులో మ‌హిళ‌పై నాలుగు రౌండ్ల‌ కాల్పులు..

Delhi Court | దేశ రాజ‌ధాని ఢిల్లీలోని సాకేత్ కోర్టు కాంప్లెక్స్‌లో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. లాయ‌ర్ వేష‌ధార‌ణ‌లో కోర్టులోకి ప్ర‌వేశించిన ఓ దుండ‌గుడు.. అక్క‌డున్న ఓ మ‌హిళ‌పై తుపాకీతో నాలుగు రౌండ్ల కాల్పులు జ‌రిపాడు. దీంతో కోర్టు కాంప్లెక్స్‌లో ఉన్న పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న బాధిత మ‌హిళ‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఆర్థిక వివాదానికి సంబంధించిన కేసు విచార‌ణ నిమిత్తం బాధిత మ‌హిళ‌.. కోర్టుకు వ‌చ్చింది. కోర్టులోకి ప్ర‌వేశించిన అనంత‌రం ఆమెపై దుండగుడు కాల్పులు జ‌రిపాడ‌ని పోలీసులు తెలిపారు. అయితే దుండగుడికి నేర చ‌రిత్ర ఉన్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఢిల్లీలోని ద్వార‌క‌లో కొద్ది రోజుల క్రితం ఓ లాయ‌ర్‌ను ఇద్ద‌రు దుండ‌గులు కాల్చి చంపిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే ఇవాళ సాకేత్ కోర్టులో కాల్పులు జ‌ర‌గ‌డంతో అటు లాయ‌ర్లు, ఇటు ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.