కొడుకు మరణంతో.. 28 ఏండ్ల కోడలిని పెళ్లాడిన 70 ఏండ్ల మామ
Marriage | కుమారుడి మరణంతో 28 ఏండ్ల కోడలిని 70 ఏండ్ల మామ పెళ్లాడాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. గోరఖ్‌పూర్ జిల్లాలోని ఛపియా ఉమ్రావ్ గ్రామానికి చెందిన కైలాశ్ యాదవ్ అనే వ్యక్తికి నలుగురు పిల్లలు. కైలాశ్ భార్య 12 ఏండ్ల క్రితమే చనిపోయింది. అయితే నలుగురు పిల్లలకు వివాహాలు కాగా, విడివిడిగా ఉంటున్నారు. కైలాశ్ మూడో […]

Marriage | కుమారుడి మరణంతో 28 ఏండ్ల కోడలిని 70 ఏండ్ల మామ పెళ్లాడాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. గోరఖ్‌పూర్ జిల్లాలోని ఛపియా ఉమ్రావ్ గ్రామానికి చెందిన కైలాశ్ యాదవ్ అనే వ్యక్తికి నలుగురు పిల్లలు. కైలాశ్ భార్య 12 ఏండ్ల క్రితమే చనిపోయింది. అయితే నలుగురు పిల్లలకు వివాహాలు కాగా, విడివిడిగా ఉంటున్నారు. కైలాశ్ మూడో కుమారుడు కొన్నేండ్ల క్రితం మరణించాడు. అప్పట్నుంచి అతడి భార్య పూజ ఒంటరిగానే ఉంటోంది. ఈ క్రమంలో మామ కైలాశ్ తన కోడలు పూజను ఓ గుడికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె నుదుట తిలకం పెట్టి, దండలు మార్చుకున్నారు. అనంతరం వారిద్దరూ కలిసి సొంతూరుకు వచ్చారు. ఇక ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఈ పెళ్లిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అంతే కాదు.. గోరఖ్‌పూర్ జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బాధ్యత ఉంటే ఆమెకు మరో పెళ్లి చేయొచ్చు కదా? అని మామను నిలదీస్తున్నారు. ఇద్దరి అంగీకారంతోనే పెళ్లి చేసుకొని ఉండొచ్చులే అని మరికొందరు వాదిస్తున్నారు. అలా ఈ పెళ్లి వార్తల్లో నిలిచింది.