అంత్యక్రియలకు డబ్బుల్లేవని.. తల్లి శవంతో పడిగాపులు
Uttar Pradesh | ఇది హృదయ విదారక ఘటన. ఓ వృద్ధురాలు తీవ్ర అనారోగ్యానికి ప్రాణాలు కోల్పోయింది. తల్లి అంత్యక్రియలు చేసేందుకు డబ్బుల్లేవని ఆమె శవంతోనే కుమారుడు ఐదు రోజుల పాటు ఉండిపోయాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఈ విషయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని గుల్‌రిహా ఏరియాలో శాంతి దేవీ(82) తన కుమారుడు నిఖిల్ మిశ్రా(45), కోడలు, మనుమడితో కలిసి ఉంటుంది. అయితే తీవ్ర అనారోగ్యానికి గురైన శాంతి దేవీ ఐదు […]

Uttar Pradesh | ఇది హృదయ విదారక ఘటన. ఓ వృద్ధురాలు తీవ్ర అనారోగ్యానికి ప్రాణాలు కోల్పోయింది. తల్లి అంత్యక్రియలు చేసేందుకు డబ్బుల్లేవని ఆమె శవంతోనే కుమారుడు ఐదు రోజుల పాటు ఉండిపోయాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఈ విషయం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లోని గుల్‌రిహా ఏరియాలో శాంతి దేవీ(82) తన కుమారుడు నిఖిల్ మిశ్రా(45), కోడలు, మనుమడితో కలిసి ఉంటుంది. అయితే తీవ్ర అనారోగ్యానికి గురైన శాంతి దేవీ ఐదు రోజుల క్రితం చనిపోయింది. అంతకుముందే నిఖిల్‌తో గొడవపడి కోడలు తన కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయిది.
అయితే మంగళవారం నిఖిల్ నివాసం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిఖిల్ ఇంట్లోకి వెళ్లి చూడగా, శాంతి దేవీ మృతదేహం లభ్యమైంది. ఐదు రోజుల క్రితం తన తల్లి మరణించిందని, అంత్యక్రియలు చేసేందుకు డబ్బుల్లేక, ఇంట్లోనే శవాన్ని ఉంచినట్లు నిఖిల్ చెప్పాడు. అయితే నిఖిల్ మానసిక వికలాంగుడు అని పోలీసుల విచారణలో తేలింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.