గోల్డ్ నెక్లెస్‌ను దొంగిలించిన వృద్ధురాలు.. వీడియో చూస్తే షాక‌వ్వాల్సిందే..

Gold Necklace | విధాత: దొంగ‌లు అంటేనే ఎవ‌రీ కంట ప‌డ‌కుండా దొంగ‌త‌నం చేస్తారు. విలువైన వ‌స్తువుల‌ను, న‌గ‌దును క్ష‌ణాల్లో దోచుకుంటారు. దొంగ‌త‌నం జ‌రిగిన‌ట్లు మ‌న‌కు కూడా తెలియ‌దు. అంత స్మార్ట్‌గా దోచుకుంటారు దొంగ‌లు. ఆ మాదిరిగానే ఓ వృద్ధురాలు కూడా జ్యువెల‌రీ షాపులోకి వెళ్లి స్మార్ట్‌గా గోల్డ్ నెక్లెస్‌ను అప‌హ‌రించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. గోర‌ఖ్‌పూర్‌లోని కంటోన్మెంట్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని బాల్‌దేవ్ ప్లాజాలోని ఓ జ్యువెల‌రీ షాపులోకి వృద్ధురాలి ప్ర‌వేశించింది. […]

గోల్డ్ నెక్లెస్‌ను దొంగిలించిన వృద్ధురాలు.. వీడియో చూస్తే షాక‌వ్వాల్సిందే..

Gold Necklace | విధాత: దొంగ‌లు అంటేనే ఎవ‌రీ కంట ప‌డ‌కుండా దొంగ‌త‌నం చేస్తారు. విలువైన వ‌స్తువుల‌ను, న‌గ‌దును క్ష‌ణాల్లో దోచుకుంటారు. దొంగ‌త‌నం జ‌రిగిన‌ట్లు మ‌న‌కు కూడా తెలియ‌దు. అంత స్మార్ట్‌గా దోచుకుంటారు దొంగ‌లు. ఆ మాదిరిగానే ఓ వృద్ధురాలు కూడా జ్యువెల‌రీ షాపులోకి వెళ్లి స్మార్ట్‌గా గోల్డ్ నెక్లెస్‌ను అప‌హ‌రించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

గోర‌ఖ్‌పూర్‌లోని కంటోన్మెంట్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని బాల్‌దేవ్ ప్లాజాలోని ఓ జ్యువెల‌రీ షాపులోకి వృద్ధురాలి ప్ర‌వేశించింది. న‌లుపు రంగు క‌ళ్ల జోడు, ముఖానికి మాస్కు ధ‌రించింది. ఇక బంగారం నెక్లెస్ చూపించ‌మ‌ని షాపు సిబ్బందిని కోరింది. జ్యువెల‌రీని చూస్తేనే మెల్లిగా నెక్లెస్ బాక్స్‌ను త‌న చీర కొంగు కింద‌కు పెట్టుకుంది.

అనంత‌రం ఏమీ తెలియ‌ని ఇంకో జ్యువెల‌రీ బాక్సును సిబ్బందికి ఇచ్చింది. త‌న వెంట తెచ్చుకున్న బ్యాగు తీసుకొని, కొంగు కిందే నెక్లెస్ బాక్సును పెట్టుకుని షాపు నుంచి వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న న‌వంబ‌ర్ 17న చోటు చేసుకోగా, ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. అయితే ఈ నెక్లెస్ విలువ రూ. 6.73 ల‌క్ష‌లు ఉంటుంద‌ని షాపు య‌జ‌మాని పేర్కొన్నాడు. జ్యువెల‌రీ షాపు య‌జ‌మాని ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.