నగ్నంగా వీడియో కాల్స్.. రూ. 5 లక్షలు పోగొట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగి
Hyderabad | అమ్మాయి పేరుతో వచ్చిన ఓ మేసేజ్‌కు స్పందించిన ప్రభుత్వ ఉద్యోగి.. రూ. 5 లక్షలను పోగొట్టుకున్నాడు. దీంతో బాధిత ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఇటీవలే ఒకమ్మాయి పేరుతో మేసేజ్ వచ్చింది. ఆ మేసేజ్‌కు ఉద్యోగి స్పందించాడు. అమ్మాయి మాట్లాడుతూ.. వాట్సాప్ చాటింగ్ లోకి రావాలని కోరింది. దీంతో ఆ ఉద్యోగి వాట్సాప్ చాటింగ్‌లోకి వెళ్లాడు. కొద్ది సేపటికే యువతి నగ్నంగా […]

Hyderabad | అమ్మాయి పేరుతో వచ్చిన ఓ మేసేజ్‌కు స్పందించిన ప్రభుత్వ ఉద్యోగి.. రూ. 5 లక్షలను పోగొట్టుకున్నాడు. దీంతో బాధిత ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఇటీవలే ఒకమ్మాయి పేరుతో మేసేజ్ వచ్చింది. ఆ మేసేజ్‌కు ఉద్యోగి స్పందించాడు. అమ్మాయి మాట్లాడుతూ.. వాట్సాప్ చాటింగ్ లోకి రావాలని కోరింది. దీంతో ఆ ఉద్యోగి వాట్సాప్ చాటింగ్‌లోకి వెళ్లాడు. కొద్ది సేపటికే యువతి నగ్నంగా కనిపించింది. ఉద్యోగిని కూడా నగ్నంగా ఉండాలని యువతి సూచించింది. దీంతో అతను కూడా నగ్నంగా మారిపోయాడు.
ఆ దృశ్యాలను యువతి రికార్డు చేసి, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరింపులకు దిగి డబ్బు డిమాండ్ చేసింది. చేసేదేమీ లేక ఉద్యోగి ఆమె అడిగినంత పుచ్చుకున్నాడు. ఓ యువతిని వేధించినట్లు తమకు ఫిర్యాదు అందిందని సైబర్ క్రైమ్ పోలీసులమని చెప్పి మరో కాల్ వచ్చింది.
ఈ క్రమంలో వారికి కూడా కొంత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇలా రూ. 5 లక్షల వరకు వసూలు చేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధిత ఉద్యోగి.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.