వయసుతో సంబంధం లేకుండా.. అవ్వను సంతోషపరిచిన తాత.. వీడియో వైరల్
Elderly Man Dance | ఆనందం పొందేందుకు వయసుతో పని లేదు. ఎంజాయ్ చేయాలనే కోరిక ఉండాలి కానీ.. వయసు అడ్డు రానే రాదు. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే. ఓ తాత కూడా వయసుతో సంబంధం లేకుండా.. అవ్వను సంతోష పరిచాడు. ది బీస్ట్ మూవీలోని అరబిక్ ఖుతీ అనే సాంగ్ కు స్టెప్పులేశాడు తాత. 70 ఏండ్ల వయసులోనూ తనలోని ప్రతిభతో అవ్వను మురిపించాడు. అవ్వ చైర్లో కూర్చుని ఉండగా.. ఆమె చుట్టూ […]

Elderly Man Dance | ఆనందం పొందేందుకు వయసుతో పని లేదు. ఎంజాయ్ చేయాలనే కోరిక ఉండాలి కానీ.. వయసు అడ్డు రానే రాదు. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే. ఓ తాత కూడా వయసుతో సంబంధం లేకుండా.. అవ్వను సంతోష పరిచాడు. ది బీస్ట్ మూవీలోని అరబిక్ ఖుతీ అనే సాంగ్ కు స్టెప్పులేశాడు తాత.
70 ఏండ్ల వయసులోనూ తనలోని ప్రతిభతో అవ్వను మురిపించాడు. అవ్వ చైర్లో కూర్చుని ఉండగా.. ఆమె చుట్టూ తిరుగుతూ స్టెప్పులేశాడు. అవ్వ కూడా ఓ వైపు సంతోషిస్తూ, మరో వైపు ముసి ముసి నవ్వులు నవ్వింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియోను వాసుదేవన్ అనే యువతి తన ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేసింది. 11 మిలియన్ల మంది వీక్షించారు.
ఇక తాత డ్యాన్స్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 70 ఏండ్ల వయసులోనూ 10 ఏండ్ల పిల్లాడిలా హుషారుగా ఉన్నాడని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఇలాంటి పార్ట్ నర్ ఉంటే జీవితమంతా సంతోషమే అని మరొకరు అన్నారు. వారి బంధం చాలా గొప్పదని మరొకరు రాసుకొచ్చారు.
వయసుతో సంబంధం లేకుండా.. అవ్వను సంతోషపరిచిన తాత.. వీడియో వైరల్ pic.twitter.com/PGVJpkUDPo
— vidhaathanews (@vidhaathanews) November 8, 2022