Marriage | 35 ఏళ్ల మహిళను పెళ్లాడిన 75 ఏళ్ల వృద్ధుడు.. శోభనం తెల్లారి మృతి
వృద్ధాప్యంలోనూ తనకో తోడు కావాలనుకున్నాడు. భార్య( Wife ) లేని జీవితం ఊహించుకోలేని ఆ వృద్ధుడు( Old Man ).. 75 ఏళ్ల వయసులో రెండో పెళ్లి( Second Marriage )కి సిద్ధమయ్యాడు. దాంతో 35 ఏళ్ల మహిళను పెళ్లాడాడు. కానీ శోభనం( First Night ) జరిగిన తెల్లారే ఆ పెద్దాయన ప్రాణాలొదిలాడు.

Marriage | లక్నో : వృద్ధాప్యంలోనూ తనకో తోడు కావాలనుకున్నాడు. భార్య( Wife ) లేని జీవితం ఊహించుకోలేని ఆ వృద్ధుడు( Old Man ).. 75 ఏళ్ల వయసులో రెండో పెళ్లి( Second Marriage )కి సిద్ధమయ్యాడు. దాంతో 35 ఏళ్ల మహిళను పెళ్లాడాడు. కానీ శోభనం( First Night ) జరిగిన తెల్లారే ఆ పెద్దాయన ప్రాణాలొదిలాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్( Uutar Pradesh )లోని జౌన్‌పూర్ జిల్లా( Jaunpur district )లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. జౌన్‌పూర్ జిల్లాలోని కుచ్‌మచ్ గ్రామానికి చెందిన సంగ్రురామ్(75) భార్య ఏడాది క్రితం చనిపోయింది. ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో.. సంగ్రురామ్ ఏడాది నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. ఇక ఉన్న వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కానీ తన భార్యను మాత్రం మరిచిపోలేకపోతున్నాడు. తనకో తోడు కావాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి సహకారం లభించింది.
ఈ క్రమంలో సెప్టెంబర్ 29వ తేదీన 35 ఏళ్ల మహిళను పెళ్లాడాడు. కోర్టులో కూడా వీరి వివాహన్ని నమోదు చేసుకున్నారు. అనంతరం స్థానిక ఆలయంలో సంప్రదాయ పద్ధతుల్లో వివాహం చేసుకున్నారు. బంధువులందరికీ భోజనాలు కూడా వడ్డించారు. ఇక పెళ్లి తంతు ముగిసింది.
అదే రోజు రాత్రి వృద్ధుడి ఇంట్లోనే శోభనం ఏర్పాట్లు చేశారు. ఇక భార్యాభర్తలిద్దరూ కలిసి ఏకాంతంగా గడిపారు. అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ.. శోభనం తెల్లారి వృద్ధుడు ప్రాణాలు విడిచాడు. దీంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ సందర్భంగా వృద్ధుడి భార్య మాట్లాడుతూ.. వ్యవసాయం దండిగా ఉంది. భయపడాల్సిన అవసరం లేదు.. నీ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వృద్ధుడు తనతో శోభనం రోజు చెప్పినట్లు ఆమె పేర్కొంది. ఇక తెల్లారే సరికి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపింది.
వృద్ధుడి మరణంపై అతని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఇది సహజ మరణం కాదు.. తమకు అనేక అనుమానాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఢిల్లీలో ఉంటున్న వృద్ధుడి బంధువులు అంత్యక్రియలను నిలిపివేశారు. పోస్టుమార్టం నిర్వహించి, మరణానికి కచ్చితమైన కారణాలు తెలిసిన తర్వాతనే అంత్యక్రియలు చేయాలని డిమాండ్ చేశారు. ఆస్తిని కొల్లగొట్టేందుకు రెండో భార్య వృద్ధుడిని చంపినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.