Samantha – Raj | ఏంటి.. చైతూతో ఉన్నప్పటి నుండే సమంత రాజ్‌తో రిలేషన్‌లో ఉందా?.. నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్
Samantha - Raj | స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, ప్రముఖ ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరు ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, పుకార్లు మొదలయ్యాయి.
Samantha – Raj | స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, ప్రముఖ ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరు ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, పుకార్లు మొదలయ్యాయి. ముఖ్యంగా “ఈ బంధం ఎప్పుడు మొదలైంది?”, “సమంత నాగచైతన్యతో ఉన్నప్పుడే వీరిద్దరూ దగ్గరయ్యారా?” వంటి ప్రశ్నలు ఎక్కువగా వినిపించాయి. అయితే, ఈ ప్రచారాల్లో చాలా వరకు నిజం కాదని సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రొఫెషనల్ రిలేషన్ నుంచే స్నేహం
సమంత, రాజ్ నిడిమోరు తొలిసారి కలిసింది ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ వెబ్ సిరీస్ సమయంలో. ఆ సమయంలో వారి మధ్య ఉన్నది పూర్తిగా వృత్తిపరమైన అనుబంధమే. సిరీస్ విజయం తర్వాత కూడా ఇద్దరూ పలు ప్రాజెక్ట్స్‌లో కలిసి పనిచేశారు. ‘సిటాడెల్: హనీ బన్నీ’, ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ వంటి ప్రాజెక్ట్స్, అలాగే సమంత నిర్మాతగా అడుగుపెట్టిన ‘శుభం’ చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం వల్ల వారి మధ్య స్నేహం మరింత బలపడింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, రాజ్ తన గత వైవాహిక జీవితం నుంచి బయటకు వచ్చి ఒంటరిగా ఉన్న సమయంలో, అంటే దాదాపు 2023 తర్వాతే వీరి మధ్య వ్యక్తిగత సాన్నిహిత్యం పెరిగింది. అంతకుముందు వరకు ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం లేదని స్పష్టంగా చెబుతున్నారు. సమంత నాగచైతన్యతో ఉన్నప్పుడు రాజ్‌తో ప్రేమాయణం సాగిందన్న ఆరోపణలకు ఆధారం లేదని ఆమె సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు.
సోషల్ మీడియా హింట్స్‌తో ఆసక్తి
ఇద్దరూ తమ బంధాన్ని ఎప్పుడూ బహిరంగంగా ప్రకటించలేదు. కానీ, కొన్ని సోషల్ మీడియా పోస్టులు, కలిసి కనిపించిన ఈవెంట్స్ వల్ల నెటిజన్లలో ఆసక్తి పెరిగింది. వెకేషన్ ఫోటోలు, “న్యూ బిగిన్నింగ్స్” అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన చిత్రాలు వీరి బంధంపై చర్చకు దారి తీశాయి. అయితే, ఇవన్నీ కూడా స్పష్టమైన ప్రకటనలు కాకుండా, తమ వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుకునే ప్రయత్నంగానే కనిపించాయి.
అబద్ధపు ప్రచారాలకు ఫుల్ స్టాప్
ఈ జంటపై వచ్చిన మరికొన్ని వార్తలు పూర్తిగా అవాస్తవమని సన్నిహితులు స్పష్టం చేశారు. రాజ్ నిడిమోరుకు పిల్లలు ఉన్నారన్న ప్రచారం, పెళ్లికి ముందు లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్నారన్న వార్తలు ఇవన్నీ ఫేక్ న్యూస్‌గా తేలాయి. సమంత మేనేజ్‌మెంట్ ఇప్పటికే వీటిని ఖండించింది. మొత్తంగా, ఎలాంటి హడావిడి లేకుండా, పుకార్లకు దూరంగా, తమ ప్రైవసీని కాపాడుకుంటూ సమంత–రాజ్ నిడిమోరు తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఊహాగానాల కంటే, వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram