Site icon vidhaatha

Turkish | గుండెల్ని.. హ‌త్తుకుంటున్న ట‌ర్కీష్ చిత్రం

Turkish |

రెక్కాడితే కానీ డొక్కాడ‌ని పేదలు.. బుక్కెడు బువ్వ కోసం.. గుక్కెడు నీళ్ల కోసం ప‌డ‌రాని పాట్లు ప‌డుతుంటారు. అలా ఆక‌లితో అల‌మ‌టించే వారికి చిన్న రొట్టె ముక్క దొరికినా.. ష‌డ్రుచులా భోజ‌నంలా భావించి త‌మ ఆక‌లిని తీర్చుకుంటారు. అలాంటి వారిని చూసిన‌ప్పుడు మ‌న హృద‌యాలు బ‌రువెక్కిపోతాయి. ఇక చిన్న పిల్ల‌లకు అలాంటి దృశ్యాలు కంట‌ప‌డితే.. త‌మ వ‌ద్ద ఉన్న ఆహారాన్ని, పైస‌ల‌ను ఆ పేద‌ల‌కు ఇచ్చేస్తుంటారు. అవ‌స‌ర‌మైతే త‌ల్లిదండ్రుల వ‌ద్ద మారాం చేసి వారికి స‌హాయం చేస్తుంటారు. అలాంటి సంఘ‌ట‌నే ఇది. డైలాగులు లేకుండా చిత్రీక‌రించిన ఓ ట‌ర్కీష్ చిత్రం అంద‌రి గుండెల‌ను హ‌త్తుకుంటుంది.

ఆ చిత్రం సారాంశం ఏంటంటే.. ఓ తండ్రి త‌న ఇంట్లోనే కూర్చొని టీవీ ఆన్ చేస్తాడు. కానీ అది స్టార్ట్ అవ్వ‌దు. తండ్రి ప‌క్క‌నే కుమారుడు కూర్చొని ఏదో ఓ పుస్త‌కం చ‌దువుతూ ఉంటాడు. టీవీ స్టార్ట్ కాక‌పోవ‌డంతో మెకానిక్‌ను తండ్రి పిలిపిస్తాడు. అత‌ను టీవీని విప్పి చూడ‌గా, వెనుక భాగంలో బ్రెడ్ ముక్క‌లు క‌నిపిస్తాయి.

ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే.. ఆ ఇంట్లో ఉన్న పిల్లాడు ఒంట‌రిగా టీవీ చూస్తున్న స‌మ‌యంలో.. పోప‌కాహార లోపంతో బాధ‌ ప‌డుతున్న పిల్ల‌ల దృశ్యాలు క‌నిపించాయి. తిండి లేక పిల్ల‌లు బ‌క్కచిక్కి ఉన్న ఆ దృశ్యాలు ఆ పిల్లాడి గుండెల‌ను తాకాయి. దీంతో త‌న హృద‌యం బ‌రువెక్కిపోతుంది.

అమాయ‌క‌త్వంతో త‌న ఇంట్లో ఉన్న బ్రెడ్ ముక్క‌ల‌ను ఆ పిల్ల‌లకు తినిపించాల‌నే ఉద్దేశంతో.. టీవీ రంధ్రాల్లో బ్రెడ్ ముక్క‌ల‌ను పెట్టాడు. దాంతో టీవీలో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తి స్టార్ట్ అవ్వ‌లేదు. ఈ విష‌యం తెలుసుకున్న పేరెంట్స్.. పిల్లాడిని గుండెల‌ను హ‌త్తుకున్నారు. మ‌రి మీరు ఓ లుక్కేయండి ఆ వీడియోపై..

Exit mobile version