Marriage | మూడేండ్లుగా సహజీవనం.. ఒకే ముహుర్తంలో ఇద్దర్ని పెళ్లాడిన యువకుడు..
Marriage | ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు( Husband ).. పెళ్లికి ముందే ఇద్దరమ్మాయిలతో సహజీవనం చేశాడు. ఆ ఇద్దరమ్మాయిలకు పిల్లలు పుట్టాక.. ఒకే ముహుర్తంలో ఇద్దర్ని పెళ్లాడాడు ఆ యువకుడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం( Bhadradri Kothagudem ) జిల్లా చర్ల( Cherla ) మండల పరిధిలోని ఎర్రబోరు గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి సత్తిబాబు.. గత మూడేండ్ల నుంచి సునీత, స్వప్నతో సహజీవనం చేస్తున్నాడు. గిరిజన […]

Marriage | ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు( Husband ).. పెళ్లికి ముందే ఇద్దరమ్మాయిలతో సహజీవనం చేశాడు. ఆ ఇద్దరమ్మాయిలకు పిల్లలు పుట్టాక.. ఒకే ముహుర్తంలో ఇద్దర్ని పెళ్లాడాడు ఆ యువకుడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం( Bhadradri Kothagudem ) జిల్లా చర్ల( Cherla ) మండల పరిధిలోని ఎర్రబోరు గ్రామంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి సత్తిబాబు.. గత మూడేండ్ల నుంచి సునీత, స్వప్నతో సహజీవనం చేస్తున్నాడు. గిరిజన కులాల్లోని యువతీయువకులు ఒకరినొకరు ఇష్టపడితే.. ముందుగానే సహజీవనం చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు.
అయితే సత్తిబాబు ఇంటర్ చదువుతున్న సమయంలో దొసిళ్లపల్లి గ్రామానికి చెందిన స్వప్నతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, సహజీవనానికి దారి తీసింది. ఇదే సమయంలో వరుసకు మరదలైన సునీతను కూడా ఇష్టపడ్డాడు. ఈ క్రమంలో స్వప్నకు పాప, సునీతకు బాబు జన్మించారు. ఆ తర్వాత ఇద్దరమ్మాయిల కుటుంబ సభ్యులను ఒప్పించి, మార్చి 9వ తేదీన ఒకే ముహుర్తంలో ఇద్దర్ని పెళ్లాడాడు సత్తిబాబు.