Accident | రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు
Accident విధాత: ఖమ్మం, సూర్యాపేట రోడ్డు మార్గంలో గురువారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనము బైకును ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరికీ తీవ్ర గాయాలవగా, ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఇద్ధరిలో ఒక యువతి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మరో యువతికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ ఆలస్యంగా రావడం పట్ల సంఘటన స్థలానికి అప్పటికే చేరుకున్న వారు, ఆ […]
Accident
విధాత: ఖమ్మం, సూర్యాపేట రోడ్డు మార్గంలో గురువారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనము బైకును ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరికీ తీవ్ర గాయాలవగా, ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
తీవ్రంగా గాయపడిన ఇద్ధరిలో ఒక యువతి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మరో యువతికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ ఆలస్యంగా రావడం పట్ల సంఘటన స్థలానికి అప్పటికే చేరుకున్న వారు, ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై పూర్తి వివరాలు తెలియ రాలేదు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram