ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ పేలుడు.. 17 మంది దుర్మ‌ర‌ణం

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బెమెత‌రా జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. బొర్సి గ్రామ ప‌రిస‌రాల్లో ఉన్న ఓ గ‌న్ పౌడ‌ర్ ఫ్యాక్ట‌రీలో పేలుడు సంభ‌వించింది

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ పేలుడు.. 17 మంది దుర్మ‌ర‌ణం

రాయ్‌పూర్: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బెమెత‌రా జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. బొర్సి గ్రామ ప‌రిస‌రాల్లో ఉన్న ఓ గ‌న్ పౌడ‌ర్ ఫ్యాక్ట‌రీలో పేలుడు సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ పేలుడు ధాటికి బొర్సి గ్రామ ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురై, ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని ప‌రుగులు తీశారు. మొత్తానికి ఆ ప‌రిస‌ర ప్రాంతాలు భీతావ‌హంగా మారాయి. మృత‌దేహాలు మాంస‌పు ముద్దలుగా మారాయి.

ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు, అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను రాయ్‌పూర్‌లోని మెహ్‌క‌ర ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతున్న వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. బెమెత‌రా క‌లెక్ట‌ర్ ఘ‌ట‌నాస్థ‌లిని ప‌రిశీలించారు. ప్ర‌మాదానికి కార‌కులైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.