Accident | తీర్ధ యాత్రలో విషాదం

Accident రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం శ్రీకాళహస్తి సమీపంలోని మెట్ట కండ్రిగ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం విధాత: తిరుమల నుండి శ్రీకాళహస్తికి వెలుతున్న యాత్రికుల కారును లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. శ్రీకాళహస్తి సమీపంలోని మెట్ట కండ్రిగ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో జరిగిన సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉండగా, వారిలో ఆరుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్ […]

Accident | తీర్ధ యాత్రలో విషాదం

Accident

  • రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
  • శ్రీకాళహస్తి సమీపంలోని మెట్ట కండ్రిగ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

విధాత: తిరుమల నుండి శ్రీకాళహస్తికి వెలుతున్న యాత్రికుల కారును లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. శ్రీకాళహస్తి సమీపంలోని మెట్ట కండ్రిగ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదంలో జరిగిన సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉండగా, వారిలో ఆరుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అతివేగంతో ఎదురుగా వస్తున్న లారీని, కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికుల కథనం.

ప్రమాదం కారణంగా ఆ మార్గంలో కొంత సేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వారి వివరాలు సేకరిస్తున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు.