Shafali Jariwala| గుండెపోటుతో నటి షఫాలీ జరివాలా మృతి

Shafali Jariwala| గుండెపోటుతో నటి షఫాలీ జరివాలా మృతి

విధాత : బాలీవుడ్ నటి ” కాంటా లగా ” ఫేమ్ షఫాలీ జరివాలా(42) అర్థరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురికావడంతో వెంటనే భర్త పరాగ్‌ త్యాగి అంధేరిలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. 2005లో వచ్చిన ‘కాంటా లగా’ రిమిక్స్ సాంగ్‌తో యూత్ ను తనవైపు తిప్పుకుని క్రేజీ స్టార్ టా పేరొందారు. అప్పటి నుంచి ఆమెకు ‘కాంటా లాగా గర్ల్‌’గా పేరు వచ్చింది. అనంతరం సల్మాన్‌ ఖాన్‌ సినిమా ముజ్సే షాదీ కరోగా చిత్రంలో ఆమె ఓ పాత్రలో మెరిశారు.

అనంతరం షఫాలీ పలు టీవీ రియాలిటీ షోలలో నటించారు. హిందీ బిగ్‌బాస్‌ 13లో కూడా పాల్గొన్నారు. 2015లో షఫాలీకి వివాహమైంది. షఫాలీ అకస్మిక మరణం ఆమె అభిమానులను దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆమెకు ఇన్‌స్టాలో 33 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. షఫాలీ మృతి పట్ల సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు.