Coronavirus: మరో బాలీవుడ్ నటికి కరోనా !

Coronavirus: : ప్రపంచ దేశాల్లో మరోసారి ఉనికి చాటుతున్న కరోనా కేసులు క్రమంగా భారత్ లోనూ విస్తరిస్తున్నాయి. ఇప్పటికే కేరళాలో 200వరకు కేసులు నమోదుకాగా..తెలుగు రాష్ట్రాల్లో కడపలో, విశాఖపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. బాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో బాలీవుడు నటీ కూడా కరోనా బారిన పడినట్లుగా వెల్లడించారు. నటి నికితా దత్తా తాను కరోనా వైరస్ బారిన పడ్డానని..తనతోపాటు తన తల్లికి కూడా కోవిడ్ సోకినట్లు ఎక్స్ లో పేర్కొంది. తాను చికిత్స తీసుకుంటున్నానని.. వైరస్ పై అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
సింగపూర్, థాయిలాండ్, చైనాలలో విస్తరిస్తున్న కరోనా మెల్లగా భారత్ లోనే విస్తరిస్తుండటంతో జాగ్రత్తలు పాటించాలని కేంద్రం సూచించింది. భారత్ లో ఇప్పటికే 257కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తునే కరోనా ఐసోలేషన్ సెంటర్లు, ఆసుపత్రులను కూడా ముందస్తుగా సిద్ధం చేయాలని కూడా పేర్కొంది.