Aditya-L1 | సెల్ఫీ తీసుకుని పంపిన ఆదిత్య ఎల్‌1

Aditya-L1 | విధాత‌: సూర్యుని ప‌రిశీల‌నకు ఇస్రో (ISRO) తొలిసారి పంపిన ఉప‌గ్ర‌హం ఆదిత్య ఎల్‌1 (Aditya L1) .. త‌న ల‌క్ష్యం వైపు దూసుకెళ్తోంది. తాజాగా భూమి, చంద్రుడు క‌లిసి ఉన్న ఒక ఫొటోను, త‌న సెల్ఫీని తీసుకుని శాస్త్రవేత్త‌ల‌కు పంపించింది. వీటిని ఇస్రో త‌న ట్విట‌ర్‌లో ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ నెల 2న శ్రీ‌హ‌రికోట షార్ నుంచి ఆదిత్య ఎల్‌1 ప్ర‌యోగం జ‌ర‌గ‌గా.. అది భూమికి 15 ల‌క్ష‌ల కి.మీ. దూరంలో ఉన్న […]

  • By: Somu    latest    Sep 07, 2023 10:49 AM IST
Aditya-L1 | సెల్ఫీ తీసుకుని పంపిన ఆదిత్య ఎల్‌1

Aditya-L1 |

విధాత‌: సూర్యుని ప‌రిశీల‌నకు ఇస్రో (ISRO) తొలిసారి పంపిన ఉప‌గ్ర‌హం ఆదిత్య ఎల్‌1 (Aditya L1) .. త‌న ల‌క్ష్యం వైపు దూసుకెళ్తోంది. తాజాగా భూమి, చంద్రుడు క‌లిసి ఉన్న ఒక ఫొటోను, త‌న సెల్ఫీని తీసుకుని శాస్త్రవేత్త‌ల‌కు పంపించింది. వీటిని ఇస్రో త‌న ట్విట‌ర్‌లో ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ నెల 2న శ్రీ‌హ‌రికోట షార్ నుంచి ఆదిత్య ఎల్‌1 ప్ర‌యోగం జ‌ర‌గ‌గా.. అది భూమికి 15 ల‌క్ష‌ల కి.మీ. దూరంలో ఉన్న ఎల్‌1 పాయింట్‌కు చేరుకోవాల్సి ఉంది.