Agent యంగ్ హీరో అక్కినేని అఖిల్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘ఏజెంట్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. మొదటి రోజు మొదటి ఆట నుంచే ఈ సినిమా చతికిలపడింది. సినిమాని చిందరవందరగా, గందరగోళంగా తెరకెక్కించడంతో.. ఏ దశలోనూ కోలుకునే పరిస్థితి కనబడలేదు. దీంతో ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా బాక్సాఫీస్ వద్ద పేరును సొంతం చేసుకుంది. వాస్తవానికి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ […]
యంగ్ హీరో అక్కినేని అఖిల్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘ఏజెంట్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. మొదటి రోజు మొదటి ఆట నుంచే ఈ సినిమా చతికిలపడింది. సినిమాని చిందరవందరగా, గందరగోళంగా తెరకెక్కించడంతో.. ఏ దశలోనూ కోలుకునే పరిస్థితి కనబడలేదు. దీంతో ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా బాక్సాఫీస్ వద్ద పేరును సొంతం చేసుకుంది.
వాస్తవానికి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశారు. మరి ఏమైందో ఏమోగానీ.. చివరి నిమిషంలో ఇతర భాషలలో ఈ సినిమాని ఆపేశారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే మాత్రం అఖిల్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది. నిర్మాతకు కూడా భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇలాంటి సినిమాల కోసమే కాచుకుని కూర్చునే డిజిటల్ వారు.. ఇప్పుడీ సినిమాని ఓటీటీలో వేసేందుకు ముందుకు వచ్చేశారు. విడుదలై మూడు వారాలు ముగిసిన వెంటనే ఈ సినిమా ఓటీటీలో దర్శనం ఇయ్యనుంది. ఏప్రిల్ 28న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. 3 వారాల తర్వాత అంటే మే 19న ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేయనుంది.
స్ట్రీమింగ్ ఎక్కడని అనుకుంటున్నారా? సోనీలివ్‌లో ‘ఏజెంట్’ సందడి చేయనుంది. సోనీలివ్ సంస్థ కూడా అధికారికంగా ‘ఏజెంట్’ ఓటీటీ స్ట్రీమింగ్ మే 19న అని ప్రకటించింది. దీంతో థియేటర్లలో ఎందుకులే అనుకున్నవారంతా.. ఓటీటీలో ఈ సినిమాని చూసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే ఓటీటీ సంస్థ కూడా ఈ సినిమాని ముందే ఓటీటీలోకి తెచ్చేస్తుందని అంతా అనుకుంటున్నారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రామకృష్ణ అలియాస్ రిక్కి(అఖిల్)కి స్పై ఏజెంట్ కావాలనేది డ్రీమ్. ఆ డ్రీమ్‌ని నిజం చేసుకునేందుకు ‘రా’లో చేరాలని ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో చేసిన మూడు ప్రయత్నాల్లోనూ అతను ఫెయిల్ అవుతాడు. దీంతో ఎథికల్ హ్యాకింగ్ విధానంలో తన కోరిక తీర్చుకోవాలని అనుకుంటాడు. అందుకోసం ‘రా’ ఛీప్ కల్నల్ మహదేవ్ (మమ్ముట్టి) సిస్టమ్‌ని హ్యాక్ చేస్తాడు.
తన సిస్టమ్ హ్యాక్ చేసిన రిక్కీని మహాదేవ్ కనిపెడితే.. అతనికి రిక్కి తన మనసులోని మాట చెబుతాడు. కానీ అతని కోతి చేష్టలు చూసి.. మహాదేవ్ కూడా అతనికి ఛాన్స్ ఇవ్వడు. కానీ, ఓ మిషన్ నిమిత్తం రిక్కీని మహాదేవ్ లైన్లోకి దింపుతాడు. భారతదేశాన్ని నాశనం చేసేందుకు గాడ్ (డినో మోరియా).. చైనాతో కలిసి ఓ భారీ కుట్రకు పథకం రచిస్తాడు.
ఆ కుట్రను కనుగొనే క్రమంలో ఒకసారి ఫెయిల్ అయిన మహదేవ్.. ఈసారి రహస్య ఏజెంట్‌గా రిక్కీని సెలక్ట్ చేసుకుంటాడు. కానీ మహదేవ్ ఆదేశాలను పక్కన పెట్టి రిక్కీ వేరే ప్రయత్నం చేస్తాడు. రిక్కీ అలా ఎందుకు చేశాడు? ‘రా’ ఏజెంట్‌గా పనికిరావు అన్న వాడిని.. రహస్య ఏజెంట్‌గా మహదేవ్ ఎందుకు సెలక్ట్ చేసుకున్నాడు? మధ్యలో వైద్యతో రిక్కీ ప్రేమాయణం ఎలా నడిచింది? ఫైనల్‌గా గాడ్ తలపెట్టిన ‘మిషన్ రాబిట్’ని ఏజెంట్ ఎలా ఆపగలిగాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
Agent Review | ఈ ‘ఏజెంట్’ చిచ్చరపిడుగు కాదు.. ఇంకా సిసింద్రీనే!