ఎయిర్‌పోర్ట్ మెట్రో.. 13వ‌ర‌కు ప్రీ బిడ్‌ల స్వీక‌ర‌ణ‌

విధాత‌: ఎయిర్‌పోర్ట్‌ మెట్రో కోసం ప్రీ బిడ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి సహా ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు. నేటి నుంచి ఈ నెల 13 వరకు ప్రీ బిడ్‌లను స్వీక‌రిస్తారు. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణం జరగనున్నది. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్ట్‌ వరకు 31 కిలోమీటర్లు ఈ నిర్మాణం జరుగుతుంది. రూ. 6,250 కోట్ల అంచనాతో మూడేళ్లలో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ […]

  • By: krs    latest    Dec 06, 2022 9:17 AM IST
ఎయిర్‌పోర్ట్ మెట్రో.. 13వ‌ర‌కు ప్రీ బిడ్‌ల స్వీక‌ర‌ణ‌

విధాత‌: ఎయిర్‌పోర్ట్‌ మెట్రో కోసం ప్రీ బిడ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి సహా ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులు హాజరయ్యారు. నేటి నుంచి ఈ నెల 13 వరకు ప్రీ బిడ్‌లను స్వీక‌రిస్తారు. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణం జరగనున్నది.

రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్ట్‌ వరకు 31 కిలోమీటర్లు ఈ నిర్మాణం జరుగుతుంది. రూ. 6,250 కోట్ల అంచనాతో మూడేళ్లలో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ నెల 9న ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాయదుర్గంలో భూమిపూజ చేయనున్నారు.