Punjab National Bank | పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో ఖాతా ఉందా..? ఈ చిన్న పనిచేయకపోతే ఆగస్టు 31 నుంచి లావాదేవీలు జరుపలేరు..!

Punjab National Bank | ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకున్నది. మీకు ఈ బ్యాంకులో ఏదైనా ఖాతా ఉంటే.. ఈ చిన్న పని చేయకపోతే ఈ నెల 31 నుంచి లావాదేవీలు జరుపలేరు. అవును.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఈ మేరకు వినియోగదారులకు నోటీసులు సైతం జారీ చేసింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదారులున్నారు. ఇప్పటి వరకు కేవైసీ వివరాలు అప్‌డేట్‌ చేయని ఖాతాదారుల ఖాతాలను నిలిపివేయనున్నట్లు […]

Punjab National Bank | పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో ఖాతా ఉందా..? ఈ చిన్న పనిచేయకపోతే ఆగస్టు 31 నుంచి లావాదేవీలు జరుపలేరు..!

Punjab National Bank |

ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకున్నది. మీకు ఈ బ్యాంకులో ఏదైనా ఖాతా ఉంటే.. ఈ చిన్న పని చేయకపోతే ఈ నెల 31 నుంచి లావాదేవీలు జరుపలేరు. అవును.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఈ మేరకు వినియోగదారులకు నోటీసులు సైతం జారీ చేసింది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదారులున్నారు. ఇప్పటి వరకు కేవైసీ వివరాలు అప్‌డేట్‌ చేయని ఖాతాదారుల ఖాతాలను నిలిపివేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బ్యాంకు ఇప్పటి వరకు కేవైసీ అప్‌డేట్‌ చేయని వినియోగదారులకు నోటీసులు పంపుతున్నది. కేవైసీ వివరాలను అప్‌డేట్‌ చేసేందుకు గడువును సైతం నిర్ణయించింది.

ఆగస్టు 31తో గడువు ముగియనుందని, డెడ్‌లైన్‌లోగా వివరాలను అప్‌డేట్‌ చేయకపోతే వినియోగదారులు బ్యాంకింగ్‌ లావాదేవీల్లో సమస్యలను ఎదుర్కోవచ్చని పేర్కొంది. ఈ విషయంపై ఈ నెల 2 నుంచి పీఎన్‌బీ కేవైసీ అప్‌డేట్‌ చేయని కస్టమర్లందరికీ రిజిస్టర్‌ అడ్రస్‌లకు నోటీసులు జారీ చేస్తున్నట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు తెలిపింది.

రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు సైతం సందేశాలను పంపుతున్నది. RBI నిబంధనల ప్రకారం.. 31 ఆగస్టు 2023లోగా తమ కేవైసీ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని కోరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సూచనల ప్రకారం.. బ్యాంకుల వినియోగదారులు కేవైసీని అప్‌డేట్‌ చేసుకోవడం తప్పనిసరి.

బ్యాంకు ఖాతాదారులు తమ బ్యాంకుకు వెళ్లినా లేదంటే.. వెబ్‌సైట్‌ ద్వారా సైతం వివరాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే, ఇందు కోసం వినియోగారులు బ్యాంకు పాస్‌బుక్‌, అడ్రస్‌ ఫ్రూప్‌, పాస్‌పోర్ట్‌సైజ్‌ ఫొటో, పాన్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణపత్రం, రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ కేవైసీ అప్‌డేట్‌ కోసం అవసరమవుతాయి.

అయితే, వీటిలో ఎలాంటి మార్పులు లేకపోతే బ్యాంకులో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, కేవైసీ స్టేటస్‌ను తెలుసుకునేందుకు పీఎన్‌బీ అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్‌ అవ్వాలి. వ్యక్తిగత సెట్టింగ్స్‌లోకి వెళ్లి కేవైసీ స్టేటస్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత అప్‌డేట్‌ లేకపోతే.. అప్‌డేట్‌ చేసుకోమని స్క్రీన్‌పై సూచిస్తుంది. దానిపై ప్రకారం వివరాలు నమోదు చేసినా కేవైసీ అప్‌డేట్‌ అవుతుంది.