MVV Satyanarayana | విశాఖ ఎంపీపై.. కబ్జా ఆరోపణలు
MVV Satyanarayana విధాత: విశాఖపట్నం నుంచి లోక్ సభకు ఎన్నికైన ఎంవీవీ సత్యనారాయణ మీద ఇంకో ఆరోపణ వచ్చింది. ఇప్పటికే రియల్ ఎస్టేట్, ఫైనాన్స్.. కబ్జాలు ఇతర అక్రమాల మీద తెగ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంవీవీ ఇప్పుడు 87వ వార్డ్‌లోని స్మశాన స్థలాన్ని కబ్జా చేస్తున్నట్లు స్థానికులు జిల్లా కలెక్టర్‌కు సోమవారం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఆయన మీద మొదటి నుంచీ ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే మొత్తానికి జగన్ హవాలో ఎంపీగా గెలిచేశారు. ఆ […]

MVV Satyanarayana
విధాత: విశాఖపట్నం నుంచి లోక్ సభకు ఎన్నికైన ఎంవీవీ సత్యనారాయణ మీద ఇంకో ఆరోపణ వచ్చింది. ఇప్పటికే రియల్ ఎస్టేట్, ఫైనాన్స్.. కబ్జాలు ఇతర అక్రమాల మీద తెగ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంవీవీ ఇప్పుడు 87వ వార్డ్‌లోని స్మశాన స్థలాన్ని కబ్జా చేస్తున్నట్లు స్థానికులు జిల్లా కలెక్టర్‌కు సోమవారం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఆయన మీద మొదటి నుంచీ ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి.
అయితే మొత్తానికి జగన్ హవాలో ఎంపీగా గెలిచేశారు. ఆ తరువాత విశాఖలోనే ఉంటున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో ఆధిపత్యపోరు సాగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోగా ఇద్దర్నీ పిలిచిన జగన్ సర్దుబాటు చేసుకుని గొడవలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ఆ తరువాత తాను వ్యాపారాన్ని హైదరాబాద్‌కు మార్చుకుంటాను, ఇక్కడ వ్యాపారం చేయలేను అని ఆమధ్య ఒక ప్రకటన చేశారు. ఇక ఇప్పుడు ఆయన మీద ఇంకో ఫిర్యాదు రావడం గమనార్హం. రానున్న ఎన్నికల్లో ఆయన ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు.