Ambati Rayudu | మరోసారి జగన్‌కు జైకొట్టిన.. అంబటి రాయుడు

Ambati Rayudu విధాత‌: అంబటి అనగానే అంబటి రాంబాబు కావచ్చు.. ఆయన నిత్యం జగన్ కు జై … అంటూనే ఉంటాడు కదా.. కొత్తగాజై కొట్టడం ఏముంది అనుకుంటున్నారేమో కాదు.. అంబటి ఆంటే అంబటి రాయుడు (Ambati Rayudu). ఐపీఎల్ క్రికెట్ ప్లేయర్. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున క్రికెట్ ఆడుతున్న రాయుడు మరోసారి జగన్ పరిపాలనకు జై కొట్టాడు. సాధారణంగా క్రికెటర్స్, సినీ నటులు.. మిగతా సెలబ్రిటీలు రాజకీయాల జోలికి వెళ్లరు. మరీ […]

Ambati Rayudu | మరోసారి జగన్‌కు జైకొట్టిన.. అంబటి రాయుడు

Ambati Rayudu

విధాత‌: అంబటి అనగానే అంబటి రాంబాబు కావచ్చు.. ఆయన నిత్యం జగన్ కు జై … అంటూనే ఉంటాడు కదా.. కొత్తగాజై కొట్టడం ఏముంది అనుకుంటున్నారేమో కాదు.. అంబటి ఆంటే అంబటి రాయుడు (Ambati Rayudu). ఐపీఎల్ క్రికెట్ ప్లేయర్.

అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున క్రికెట్ ఆడుతున్న రాయుడు మరోసారి జగన్ పరిపాలనకు జై కొట్టాడు. సాధారణంగా క్రికెటర్స్, సినీ నటులు.. మిగతా సెలబ్రిటీలు రాజకీయాల జోలికి వెళ్లరు. మరీ ఇంట్రెస్ట్ ఉంటే అలీ మాదిరిగా రాజకీయాల్లోకి వస్తారు తప్ప పార్టీల గురించి కామెంట్స్ చేయరు.

ఆమధ్య హీరో రామ్ ఓ సారి జగన్ గురించి కామెంట్స్ చేసినందుకు సోషల్ మీడియాలో ఆయన్ను వెంటాడి టార్చర్ చేశారు. కాబట్టి వాళ్ళు రాజకీయాల గురించి కామెంట్స్ చేయరు. కానీ ఈ అంబటి రాయుడు మాత్రం తరచూ జగన్ గురించి పాజిటివ్ కామెంట్స్ చేస్తూ వస్తున్నాడు. గతంలోనూ వైయస్ జగన్ చేసిన ప్రసంగానికి ఫిదా అయ్యి ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.

తాజాగా.. ఈరోజు వసతి దీవెన నిధుల బదిలీ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సింగనమలలో జరిగిన సభలో దివ్య దీపికా అనే స్టూడెంట్ మాట్లాడుతూ సీఎం జగన్ విద్యా రంగానికి చేస్తున్న సేవలను కొనియాడారు. తమను జగన్ ఎంతగా ప్రోత్సహిస్తున్నది తన అనర్గళ ప్రసంగంలో వివరించింది.

ఈ క్లిప్‌ను సైతం రాయుడు తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ పిల్లల వికాసానికి జగన్ చేస్తున్న కృషిని రాయుడు అభినందించారు. మొత్తానికి ఒక క్రీడాకారుడు అయి ఉండి కూడా ఇలా ఓపెన్‌గా జగన్‌కు సపోర్ట్ చేయడం చెప్పుకోదగ్గదని ప‌లువురు భావిస్తున్నారు.