Philippines | ఫిలిప్పీన్స్‌లో కూలిన విమానం.. భారతీయ విద్యార్థి మృతి
Philippines | ఫిలిప్పీన్స్ (Philippines) విమానం కూలిపోయిన (Plane Crash) ఘటనలో భారత్‌కు చెందిన యువకుడు, అతడితో ఉన్న ట్రైనర్ పైలట్ ఇద్దరూ దుర్మరణం చెందారు. ఇద్దరు కూర్చునేందుకు వీలుండే ఎకో ఎయిర్ సెస్నా 152 శిథిలాలను అపాయావో ప్రావిన్స్ వద్ద గుర్తించినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. మృతులను అన్షుమ్ రాజ్‌కుమార్, కెప్టెన్ ఎడ్జెల్ జాన్ లుంబవో టబూజోలుగా ధ్రువీకరించారు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న తీవ్ర అననుకూల వాతావరణం కారణంగా వారి మృతదేహాలను ఘటనా స్థలం […]

Philippines |
ఫిలిప్పీన్స్ (Philippines) విమానం కూలిపోయిన (Plane Crash) ఘటనలో భారత్‌కు చెందిన యువకుడు, అతడితో ఉన్న ట్రైనర్ పైలట్ ఇద్దరూ దుర్మరణం చెందారు. ఇద్దరు కూర్చునేందుకు వీలుండే ఎకో ఎయిర్ సెస్నా 152 శిథిలాలను అపాయావో ప్రావిన్స్ వద్ద గుర్తించినట్లు అధికారులు గురువారం వెల్లడించారు.
మృతులను అన్షుమ్ రాజ్‌కుమార్, కెప్టెన్ ఎడ్జెల్ జాన్ లుంబవో టబూజోలుగా ధ్రువీకరించారు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న తీవ్ర అననుకూల వాతావరణం కారణంగా వారి మృతదేహాలను ఘటనా స్థలం నుంచి తీసుకు రాలేకపోయారు.
రెస్క్యూ బృందం మరో హెలికాప్టర్‌లో వెళ్లినప్పటికీ అక్కడ దిగడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని పేర్కొన్నారు. ఇక్కడి లావోగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం మధ్యాహ్నం 12.16 గంటలకు టేకాఫ్ అయిన సెస్నా 152 విమానం.. 3.16 గంటలకు తన గమ్యస్థానాన్ని చేరుకోవాల్సి ఉన్నా ఎంతకీ ల్యాండ్ కాలేదు.
ఈ ఏడాది కూలిపోయిన సెస్నా విమానాల్లో ఇది మూడోది కావడం గమనార్హం. ఆయా ఘటనల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. మరోవైపు ఫిలిప్పీన్స్‌కు చెందిన ఎకో ఎయిర్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.