UP | యూపీలో మ‌రో దారుణం.. చెల్లిని చంపి.. త‌ల‌తో ఊరంతా సంచారం

UP వేరే సామాజికవ‌ర్గ‌ం వ్య‌క్తితో వెళ్లిపోయింద‌ని ఘాతుకం విధాత‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దారుణం ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. మ‌రొక ప‌రువు హ‌త్య జ‌రిగింది. కుటుంబ ఇష్టానికి వ్య‌తిరేకంగా వేరే సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తితో వెళ్లిపోయింద‌నే అక్క‌సుతో బారాబంకి జిల్లాలో 24 ఏళ్ల యువకుడు తన సోదరిని అత్యంత కిరాత‌క‌రంగా చంపేశాడు. ఆమె తలను నరికివేసాడు. కాగా.. అదే త‌ల‌తో ఊరంతా తిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రియాజ్ అనే వ్యక్తి తన సోదరి […]

  • Publish Date - July 21, 2023 / 11:38 AM IST

UP

  • వేరే సామాజికవ‌ర్గ‌ం వ్య‌క్తితో వెళ్లిపోయింద‌ని ఘాతుకం

విధాత‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దారుణం ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. మ‌రొక ప‌రువు హ‌త్య జ‌రిగింది. కుటుంబ ఇష్టానికి వ్య‌తిరేకంగా వేరే సామాజిక‌వ‌ర్గానికి చెందిన వ్య‌క్తితో వెళ్లిపోయింద‌నే అక్క‌సుతో బారాబంకి జిల్లాలో 24 ఏళ్ల యువకుడు తన సోదరిని అత్యంత కిరాత‌క‌రంగా చంపేశాడు. ఆమె తలను నరికివేసాడు.

కాగా.. అదే త‌ల‌తో ఊరంతా తిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రియాజ్ అనే వ్యక్తి తన సోదరి వేరొక వర్గానికి చెందిన వ్యక్తితో పారిపోవడంతో కలత చెందాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు.

Latest News