APPSC | రెండు రోజులు.. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నిలిపివేత

APPSC విధాత: రెండు రోజుల పాటు వెబ్ సైట్ సేవలు నిలిపివేస్తున్నట్లుగా ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. వార్షిక నిర్వహణ పనుల నిమిత్తం 2023-24 సంవత్సరానికి సంబంధించి ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆగస్టు 18వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఆగస్టు 20వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో సేవలు ఉండవని స్పష్టం చేసింది. ఉద్యోగ నియామక రాత పరీక్షలకు […]

APPSC | రెండు రోజులు.. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నిలిపివేత

APPSC

విధాత: రెండు రోజుల పాటు వెబ్ సైట్ సేవలు నిలిపివేస్తున్నట్లుగా ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. వార్షిక నిర్వహణ పనుల నిమిత్తం 2023-24 సంవత్సరానికి సంబంధించి ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఆగస్టు 18వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఆగస్టు 20వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో సేవలు ఉండవని స్పష్టం చేసింది. ఉద్యోగ నియామక రాత పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ముందే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఏపీపీఎస్సీ వెల్లడించింది.