Haryana | హ‌ర్యానాలో అగ్గి రాజేసిన విశ్వ హిందూ ప‌రిష‌త్ యాత్ర‌..

Haryana | హ‌ర్యానాలో విశ్వ హిందూ ప‌రిష‌త్ యాత్ర అగ్గి రాజేసింది. విశ్వ హిందూ ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన బ్రిజ్ మండ‌ల్ జ‌లాభిషేక్ యాత్ర ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు దారి తీసింది. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఆస్తుల‌ను ధ్వంసం చేశారు. నుహ్ సిటీ స‌మీపంలోని గురుగ్రామ్ - అల్వార్ జాతీయ ర‌హ‌దారిపైకి యాత్ర చేరుకోగానే కొంద‌రు దుండ‌గులు అడ్డుకున్నారు. యాత్ర నిర్వ‌హిస్తున్న వారిపై రాళ్ల‌తో దాడి చేశారు. అంతే కాకుండా కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఆస్తుల‌పై […]

Haryana | హ‌ర్యానాలో అగ్గి రాజేసిన విశ్వ హిందూ ప‌రిష‌త్ యాత్ర‌..

Haryana | హ‌ర్యానాలో విశ్వ హిందూ ప‌రిష‌త్ యాత్ర అగ్గి రాజేసింది. విశ్వ హిందూ ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన బ్రిజ్ మండ‌ల్ జ‌లాభిషేక్ యాత్ర ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు దారి తీసింది. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఆస్తుల‌ను ధ్వంసం చేశారు.

నుహ్ సిటీ స‌మీపంలోని గురుగ్రామ్ – అల్వార్ జాతీయ ర‌హ‌దారిపైకి యాత్ర చేరుకోగానే కొంద‌రు దుండ‌గులు అడ్డుకున్నారు. యాత్ర నిర్వ‌హిస్తున్న వారిపై రాళ్ల‌తో దాడి చేశారు. అంతే కాకుండా కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఆస్తుల‌పై రాళ్లతో దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ప‌లు వాహ‌నాల‌కు నిప్పు పెట్టారు.

దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన‌డంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. ఆందోళ‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. ప‌లువురికి గాయాల‌య్యాయి. అయితే భ‌జ‌రంగ్ ద‌ళ్‌కు చెందిన ఓ కార్య‌క‌ర్త అభ్యంత‌ర‌క‌ర‌మైన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన కార‌ణంగానే ఈ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని తెలుస్తోంది.

స్థానికంగా నేర‌స్తులైన మోను మ‌నేస‌ర్, అత‌ని మ‌ద్ద‌తుదారులు కొద్ది రోజుల క్రితం ఓ అభ్యంత‌ర‌క‌ర‌మైన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. యాత్ర నిర్వ‌హించే రోజు మెవాత్ వ‌ద్ద ఉంటాన‌ని త‌న‌ను ఎదుర్కోవ‌చ్చ‌ని బ‌హిరంగ స‌వాల్ చేశాడు మోను మ‌నేస‌ర్. ఈ క్ర‌మంలోనే ఈ దాడి జ‌రిగింద‌ని తెలుస్తోంది.