Kuber | కుబేర్ వీర్యంతో.. నెలకు రూ. 20 లక్షల వరకు ఆదాయం..!
Kuber | ఈ వీర్యం( Sperm ) చాలా కాస్ట్‌లీ గురు. ఒక్కో డోస్ ధర రూ. 500. అలా నెలకు వీర్యంతో రూ. 20 లక్షల వరకు సంపాదిస్తున్నాడు ఓ వ్యక్తి. అదేదో వీర్యం మగాడిది అనుకుంటే పొరపాటే. ఇది ఓ దున్నపోతు( Kuber ) వీర్యం. మరి ఈ దున్నపోతు ప్రత్యేకత ఏంటి..? దాని వీర్యానికి ఎందుకంత డిమాండ్ అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
Kuber | హర్యానా( Haryana )లోని ఫతేహాబాద్ జిల్లా( Fatehabad district )లోని నాగోడి గ్రామానికి చెందిన వికాస్( Vikas ) పశువులను పెంచుతున్నాడు. అయితే దున్నపోతులను పెంచడం ఆయన ప్రత్యేకత. కుబేర్( Kuber ) అనే దున్నపోతును కూడా ప్రత్యేక బాధ్యతతో పెంచాడు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద పశువుల సంతగా పరిగణించే రాజస్థాన్‌లోని పుష్కర్ మేళాలో కుబేర్ అత్యుత్తమ, ఖరీదైన దున్నపోతుగా నిలిచింది. పుష్కర్ మేళా తర్వాత కుబేర్ విలువ రూ. 21 కోట్లకు చేరింది. అనేక అంతర్జాతీయ పశు ప్రదర్శనల్లో ఇది నంబర్ వన్ టైటిల్‌ను గెలుచుకుని ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. ఇటీవల, ఏపీకి చెందిన ఓ వ్యక్తి ఇటాలియన్ మధ్యవర్తితో కలసి దీన్ని రూ.21 కోట్లకు కొనుగోలు చేసేందుకు బిడ్ దాఖలు చేసినట్లు సమాచారం.

కుబేర్ వీర్యం చాలా ఖరీదు..!
ఈ సందర్భంగా కుబేర్ యజమాని వికాస్ మాట్లాడుతూ.. కుబేర్‌ను తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా చూసుకుంటున్నామని తెలిపారు. సొంత బిడ్డలా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. దీని మేత కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కుబేర్ వీర్యం( Semen ) ఒక్కో డోస్ రూ. 500 చొప్పున అమ్మినా నెలకు రూ. 20 లక్షల వరకు ఆదాయం వస్తుందన్నారు. అందుకే దేశ విదేశాల నుంచి అనేకమంది దీన్ని కొనుగోలు చేసేందుకు రూ.కోట్లలో ఆఫర్ చేస్తున్నారని వికాస్ తెలిపారు.
దున్నపోతు ఆహారం ఇదే..
అన్ని దున్నలకు వేసినట్టు కేవలం గడ్డి మాత్రమే వేయరు దీనికి. ఒక్కో కాలంలో ఒక్కో రకంగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆహారం అందిస్తున్నామని వికాస్ పేర్కొన్నారు. శీతాకాలంలో క్యారెట్ రసంతో పాటు తాజా క్యారెట్‌లను అందిస్తామన్నారు. రోజూ ఐదు కి.మీ. నడిపించడంతో పాటు రెండు గంటల పాటు మసాజ్ కూడా చేస్తారు. ఎనిమిది అడుగుల పొడవు, ఐదు అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న ఈ ‘కుబేర్’ వీర్యంతో ఇప్పటివరకు 3వేలకు పైగా దూడలు జన్మించాయని వికాస్ వెల్లడించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram