Assam | కారు – ట్రక్కు ఢీ : ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం
Assam | అసోంలోని గువాహటిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కారు - ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం గువాహటిలోని జలుక్‌బరి ఫ్లై ఓవర్ సమీపంలో చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఎక్కి.. ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో 10 మంది ఉన్నారు. అందులో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు […]

Assam | అసోంలోని గువాహటిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కారు – ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం గువాహటిలోని జలుక్‌బరి ఫ్లై ఓవర్ సమీపంలో చోటు చేసుకుంది.
ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఎక్కి.. ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో 10 మంది ఉన్నారు. అందులో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఉన్న వారంతా అసోం ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు అని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను గువాహటి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ప్రమాద ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వా శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ కాలేజీ ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడినట్లు సీఎం పేర్కొన్నారు.