AP | చంద్రబాబు, దేవినేని ఉమాపై హత్యాయత్నం కేసులు
AP | విధాత: పుంగనూరులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటన ఇప్పుడు మరింత సీరియస్ అయింది. ఇప్పటికే దాదాపు 270 మంది మీద కేసులు బుక్ చేసిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి పక్కజిల్లాలోని జిల్లాకు తరలించారు. ఇక ఇప్పుడు ఆ ఘటనలో చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరుల మీద పెద్ద కేసులు బుక్ చేసిన పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. ఆగస్టు నాలుగున 4న చంద్రబాబు […]

AP |
విధాత: పుంగనూరులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటన ఇప్పుడు మరింత సీరియస్ అయింది. ఇప్పటికే దాదాపు 270 మంది మీద కేసులు బుక్ చేసిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి పక్కజిల్లాలోని జిల్లాకు తరలించారు.
ఇక ఇప్పుడు ఆ ఘటనలో చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరుల మీద పెద్ద కేసులు బుక్ చేసిన పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. ఆగస్టు నాలుగున 4న చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన తరుణంలో పుంగనూరు, అంగళ్ల పట్టణాలకు వెళ్లారు.
ఈ సందర్భంగా టిడిపి కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. దీంతో పోలీసులు ఆ ఘటనను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ గొడవలో ఏ-1 గా టీడీపీ అధినేత చంద్రబాబును, ఏ-2గా దేవినేని ఉమా మహేశ్వర రావు, ఏ3గా అమర్నాథ్ రెడ్డిని చేర్చారు.
ఇంకా నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, దమ్మాలపాటి రమేశ్, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని సహా 20 మందిపై కేసులు నమోదైనాయి. హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేశారు.
మారణాయుధాలు, ఐరన్ రాడ్లు, ఇటుకలు, కర్రలు వంటి వాటితో వాహనాల్లో ప్రయాణిస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఉమాపతిరెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసారు. . ఈ మేరకు కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు 307 సెక్షన్ కింద హత్యాయత్నం, 120బీ సెక్షన్ కింద నేరపూరిత కుట్ర చేసినట్టు అందులో పేర్కొన్నారు.