Avinash:అమ్మ‌కు బాలేద‌ని వీడియో చేసిన అవినాష్‌.. ఆ డ‌బ్బుతోనే కారు కొన్నావా అంటూ ట్రోలింగ్

Avinash: బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు అవినాష్. ఈ షో త‌ర్వాత అవినాష్‌కి విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. బిగ్ బాస్ షో ఆఫ‌ర్ కూడా వ‌చ్చింది. ఎప్పుడైతే బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టావో అప్ప‌టి నుండి అవినాష్ రేంజ్ మ‌రింత పెరిగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్ 50 ల‌క్షల రూపాయ‌ల వ‌రకు తీసుకున్నట్టు స‌మాచారం. బిగ్ బాస్ షోతో వ‌చ్చిన మొత్తాన్ని అవినాష్ చాలా చ‌క్క‌గా ఉప‌యోగించుకున్నాడు. అప్పుల‌న్నీ క‌ట్టేశాడు. […]

  • By: sn    latest    Jul 24, 2023 10:53 AM IST
Avinash:అమ్మ‌కు బాలేద‌ని వీడియో చేసిన అవినాష్‌.. ఆ డ‌బ్బుతోనే కారు కొన్నావా అంటూ ట్రోలింగ్

Avinash: బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు అవినాష్. ఈ షో త‌ర్వాత అవినాష్‌కి విప‌రీత‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. బిగ్ బాస్ షో ఆఫ‌ర్ కూడా వ‌చ్చింది. ఎప్పుడైతే బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టావో అప్ప‌టి నుండి అవినాష్ రేంజ్ మ‌రింత పెరిగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్ 50 ల‌క్షల రూపాయ‌ల వ‌రకు తీసుకున్నట్టు స‌మాచారం. బిగ్ బాస్ షోతో వ‌చ్చిన మొత్తాన్ని అవినాష్ చాలా చ‌క్క‌గా ఉప‌యోగించుకున్నాడు. అప్పుల‌న్నీ క‌ట్టేశాడు. ఇల్లు తీసుకున్నాడు. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకున్నాడు. త్వ‌ర‌లో తండ్రి కాబోతున్నాడు. అయితే బిగ్ బాస్ త‌ర్వాత స్టార్ మాలోనే షోస్ చేసుకుంటూ వ‌స్తున్న అవినాష్ అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో కూడా తెగ సంద‌డి చేస్తున్నారు.

త‌న యూట్యూబ్ చానెల్ ద్వారా అనేక వీడియోలు విడుద‌ల చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. ఇంట్లో లేదా సెట్స్ లో లేదంటే ఫ్రెండ్స్ తో క‌లిసి చేస్తున్న సంద‌డి ఇలా ఏదైన స‌రే వ్లాగ్ చేసి పెడుతున్నాడు. ఇటీవ‌ల త‌న అమ్మ‌కు బాగాలేద‌ని, ఆసుప‌త్రిలో జాయిన్ చేశాం అని త‌న వీడియో ద్వారా తెలియ‌జేశాడు. అయితే ఈ వీడియోపై చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఇలాంటివి ఎవ‌డైన వీడియోలు చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తాడా, డ‌బ్బులు వ‌స్తాయంటే ఏవైన చేస్తావా అని ఆయ‌న‌ని తిట్టిపోసారు. దానిపై అవినాష్ ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోగా, తాజాగా త‌న ఇన్‌స్టాలో పాతిక ల‌క్ష‌ల విలువైన కారు కొనుగోలు చేశామ‌ని, దానికి సంబంధించిన వ్లాగ్ యూట్యూబ్‌లో చూడండి అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు.

ఈ పోస్ట్‌పై నెటిజ‌న్స్ కొంద‌రు దారుణంగా తిట్టిపోస్తున్నారు. మొన్న‌నే మీ అమ్మకి ఆరోగ్యం బాలేద‌ని ఓ వీడియో పెట్టిన‌వ్‌గా.దాంతో వచ్చిన డ‌బ్బుల‌తోనే ఈ కారు కొన్నావా అంటూ కొంద‌రు పంచ్‌లు వేస్తున్నారు. మీ అమ్మకు ఆరోగ్యం బాగా లేదు అన్న స‌మ‌యంలో ఆమె గురించి ప‌ట్టించుకోకుండా… ఇప్పుడు ఈ కారు అవసరమా? అంటూ అవినాష్‌ను తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఇక ప‌లువురు ప్ర‌ముఖులు అవినాష్‌కి కంగ్రాట్స్ చెబుతున్నారు. వారికి ఆయ‌న రిప్లై ఇస్తున్న నేప‌థ్యంలో కూడా మండిప‌డుతున్నారు. మ‌న‌కి అయితే రిప్లై ఇవ్వ‌డం లేదు కాని వారికి వెంట‌నే స్పందిస్తున్నాడంటూ అవినాష్‌ని తెగ ట్రోల్ చేస్తున్నారు.